Sai Durga tej: అమ్మ కంటికి రెప్పలా.. అందుకే అమ్మకే అంకితం..
ABN , Publish Date - Aug 10 , 2025 | 07:04 PM
సుప్రీమ్ హీరో సాయిధరమ్ (Sai Durga tej) తేజ్‌కు తల్లంటే అమితమైన ప్రేమ. ఆమె ఉన్న ప్రేమాభిమానాలతో తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు. తన ప్రతి అడుగులోనూ అమ్మ ఉందని తేజ్ చెబుతుంటారు
సుప్రీమ్ హీరో సాయిధరమ్ (Sai Durga tej) తేజ్‌కు తల్లంటే అమితమైన ప్రేమ. ఆమె ఉన్న ప్రేమాభిమానాలతో తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు. తన ప్రతి అడుగులోనూ అమ్మ ఉందని తేజ్ చెబుతుంటారు. తల్లిపై ఉన్న గౌరవాన్ని మరోసారి చాటి చెప్పాడు తేజ్. తాజాగా అతన్ని ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వరించింది. ఆ ఆవార్డును తల్లి చేతుల మీదుగా అందుకుని తల్లిపై ఉన్న ప్రేమను చాటి చెప్పాడు.
ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 (Filmfare Glamour And Style Awards South2025) శనివారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. సౌత్ సెలబ్రిటీలు ఈ వేడుకలో సందడి చేశారు. ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డుల్లో తేజ్‌ను మోస్ట్ డిజైరబుల్ (మేల్) అవార్డు వరించింది. ఆయనకు ఈ అవార్డును దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా అందజేయాలని ప్రకటించారు. అయితే తేజ్ తన తల్లి విజయ దుర్గ, తండ్రి డాక్టర్ శివ ప్రసాద్.. ఇద్దరి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలనుందని నిర్వహకులను రిక్వెస్ట్ చేశారు. తనకు వచ్చిన మోస్ట్ డిజైరబుల్ అవార్డును తన తల్లికి అంకితం చేస్తునట్లు తేజ్ ప్రకటించారు.
అమ్మే అండగా నిలిచింది..
రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో తనను కంటికి రెప్పలా తల్లి విజయ దుర్గ చూసుకున్నారని తేజ్ చెప్పుకొచ్చారు. ‘నేను అంతా కోల్పోయానని అనుకున్నప్పుడు... నాకు మా అమ్మ అండగా నిలిచింది. ధైౖర్యం చెప్పింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మళ్ళీ నన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చింది’ అన్నారు సాయి దుర్గా తేజ్. అలాగే తనకు సౌకర్యవంతమైన దుస్తులు ధరించమని సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తన ఫేవరేట్ స్టైల్ ఐకాన్స్ అని తెలిపారు. సాయి తేజ్ ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ సినిమా చేస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
----------------------