Kalki Sai Pallavi: కల్కి సీక్వెల్.. దీపిక స్థానంలో సాయిపల్లవి!
ABN , Publish Date - Oct 04 , 2025 | 06:52 PM
'కల్కి 2898 ఎ.డి.' సీక్వెల్ నుండి దీపికా పదుకొణే ను తప్పించిన నేపథ్యంలో ఆ చిత్రంలో సాయిపల్లవిని తీసుకుంటున్నారనే చర్చ ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే దర్శకుడు నాగ అశ్విన్... సాయిపల్లవితో ప్రాధమికంగా చర్చించినట్టు సమాచారం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే (Deepika Padukone) 'కల్కి 2898 ఎ.డి.' (Kalki 2898 A.D.) నుండి తప్పుకున్న తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ (Prabhas) 'స్పిరిట్' నుండి దీపికా పదుకొణే ను తప్పించడం, ఆ తర్వాత 'కల్కి' నుండి కూడా ఆమె తప్పుకోవడంతో దీపికా పదుకొణేను నిర్మాతలు తట్టుకోవడం కష్టమనే ప్రచారం బాగా జరిగింది. ఇదే సమయంలో దీపికా పదుకొణే అటు అల్లు అర్జున్, ఇటు షారూఖ్ ఖాన్ కొత్త సినిమాలకు సైన్ చేసింది. జాతీయ స్థాయిలో దీపికా పదుకొనే వ్యవహారం చర్చనీయాంశంగా మారిన టైమ్ లోనే... 'కల్కి' సీక్వెల్ లో ఆమె స్థానాన్ని సాయి పల్లవి (Sai Pallavi) తో భర్తీ చేయించే పనిలో నాగ అశ్విన్ ఉన్నారనే వార్త హల్చల్ చేయడం మొదలైంది.
సాయిపల్లవి ఇప్పుడు హిందీ రామాయణ్ (Ramayan) లో సీతగా నటిస్తోంది. దాంతో జాతీయ స్థాయిలో ఆమెకు మంచి గుర్తింపు వస్తోంది. సాయిపల్లవి చేసిన వివిధ భాషా చిత్రాలు హిందీలోకి అనువాదం కావడంతో ఉత్తరాది వారికీ సాయిపల్లవి బాగా తెలిసిన వ్యక్తే. ఈ నేపథ్యంలో నటిగానూ, ఆమెకు ఉన్న గుర్తింపు కారణంగా 'కల్కి' సీక్వెల్ లో తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. సాయిపల్లవితో ప్రాధమికంగా సంప్రదింపులూ చేశారని తెలుస్తోంది. దీపికా పదుకొణే పాత్రను యథాతథంగా కొనసాగించడం కాకుండా... 'కల్కి' సీక్వెల్ లో సాయి పల్లవిని ప్రధాన పాత్రకు తీసుకుంటారని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం 'కల్కి 2898 ఎ.డి' సీక్వెల్ ఏ యేడాది సెట్స్ పైకి వెళ్ళదని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మూడు నెలల్లో ప్రభాస్ తన మిగతా చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉంటాడని, కొత్త సంవత్సరంలో ఫ్రెష్ గా 'కల్కి' సీక్వెల్ షూటింగ్ ఆరంభం అవుతుందని అంటున్నారు.