Sambarala Yeti Gattu: ‘సాంబరాల ఏటిగట్టు’.. అసుర ఆగమనం వేళైంది
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:11 PM
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం సాంబరాల ఏటిగట్టు (Sambarala Yeti Gattu) దసరా విడుదలకు సిద్ధమవుతోంది.
‘విరూపాక్ష’ వంటి హిట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej), నటించిన నూతన చిత్రం ‘సాంబరాల ఏటిగట్టు (Sambarala Yeti Gattu)’. రోహిత్ కెపి ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండగా హనుమాన్ ఫేం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, జగపతి బాబు, సాయి కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే.. అన్ని సవ్యంగా ఉంటే ఇప్పటికే ప్రేక్షకుల ఎదుటకు రావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆరేడు నెలలుగా ఎలాంటి ఆప్డేట్స్ లేక ఇక సినిమా ఉంటుందో లేదో అనే వరకు పరిస్దితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు మేకర్స్ బుధవారం సాయి దుర్గతేజ్ పుట్టిన రోజును పురస్కరించిచుకుని ఈ చిత్రం నుంచి ఓ కీలక ఆప్టేట్ ఇచ్చారు.
బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్‌లో ప్రత్యేక ఈవెంట్ (Glimpse Grand Launch Event) నిర్వహించి సినిమా నుంచి అసుర గమనం ‘ASURA AAGAMANA’ పేరుతో సర్‌ఫ్రైజ్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే సుమారు రే.120 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందింన ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా విడుదల చేస్తుండడం విశేషం.