Sai Durga Tej - OG: బెంగాల్ టైగర్ వేటకు బయల్దేరింది
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:45 PM
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఓజీ ఫీవర్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబిట్రీల వరకూ ఇదే టాపిక్ నడుస్తోంది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘ఓజీ’ (OG movie) సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఓజీ ఫీవర్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబిట్రీల వరకూ ఇదే టాపిక్ నడుస్తోంది. దాంతో, సినిమాకు హైప్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ ట్రైలర్ వీక్షించిన సాయిధుర్గ తేజ్ (Sai Durga tej) సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
‘మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది. నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ర్టామ్. నా హీరో, నా గురువు కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారు. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది. ఓజీని మనమంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సుజీత్ విజన్, థమన్ సంగీతం, పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తితో ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఒక పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చేలా ఉంది. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 24న పెయిడ్ ప్రీమియర్లకు అనుమతి దక్కింది. వాటికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.