The Raja Saab: సహనా.. సహానా వీడియో సాంగ్.. డార్లింగ్ డ్యాన్స్ తేడా కొడుతుందే
ABN , Publish Date - Dec 17 , 2025 | 08:35 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab).
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు.
మొదట మాస్ సాంగ్ తో రచ్చ రేపిన రాజాసాబ్ ఇప్పుడు మెలోడీ సాంగ్ తో వచ్చాడు. సహానా.. సహానా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రభాస్ రాధేశ్యామ్ తరువాత రొమాన్స్ నే మర్చిపోయాడు. అన్ని యాక్షన్ సినిమాలతో అలరించడంతో హీరోయిన్ తో డ్యాన్స్ వేస్తూ డ్యూయెట్ పాడడం ఫ్యాన్స్ మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆ కొరత ఈ సాంగ్ తో తీరిపోయింది అని చెప్పొచ్చు.
సాంగ్ మొత్తం ప్రభాస్ మీద నుంచి ఎవరూ చూపు తిప్పుకోలేరు. అంత క్లాస్ గా కనిపించాడు. పక్కన నిధి ఉన్నా కూడా డార్లింగ్ డామినేట్ చేశాడు అని చెప్పొచ్చు. ఇక కృష్ణకాంత్ లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. థమన్ ఈసారి మాత్రం అదరగొట్టేశాడు. ఇక విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజని తమ వాయిస్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. సాంగ్ అతి తక్కువ సమయంలోనే చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లొకేషన్స్ కానీ, ప్రభాస్ - నిధి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.
అంతా బావుంది కానీ, ప్రభాస్ డ్యాన్స్ కొంచెం తేడాగా ఉంది. డార్లింగ్ ని చాలా ఇబ్బందిపెట్టి ఈ డ్యాన్స్ చేయించినట్లుగా అనిపిస్తుంది. బాహుబలి తరువాత నుంచి ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెల్సిందే. దానికోసమే ఈ మధ్య అమెరికా వెళ్లి సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఇక ఈ సాంగ్ లో కూడా డార్లింగ్ డ్యాన్స్ స్టైల్ గా, క్యూట్ గా ఉన్నా కూడా.. మోకాలిని వంచడానికి ప్రభాస్ ఇబ్బంది పడినట్లు కనిపిస్తుంది. బాడీతో రిథమ్ కి తగ్గట్లు డ్యాన్స్ వేసినా కాలు మాత్రం కదపలేకపోయాడు. దీనివలన ఏదో వెలితిగా అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా మోకాలి సర్జరీ అయినా కూడా డార్లింగ్ ఈ రేంజ్ లో డ్యాన్స్ స్టెప్పులు వేయడం గ్రేట్ అని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.