The Raja Saab: సహనా.. సహనా ప్రోమో.. క్లాస్ లుక్ లో ప్రభాస్ అదిరిపోయాడంతే
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:37 PM
ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ది రాజా సాబ్ (The Raja Saab) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.
The Raja Saab: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ది రాజా సాబ్ (The Raja Saab) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ది రాజా సాబ్ రిలీజ్ కు సిద్దమవుతుంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అభిమానులను ఏ రేంజ్ లో అలరిస్తుందో అందరికీ తెల్సిందే. యాక్షన్ సినిమాల్లో.. ఫైట్స్ చేస్తూ రొమాన్స్ మర్చిపోయిన డార్లింగ్ తో మారుతీ రాజా సాబ్ లో స్టెప్స్ వేయించడమే కాకుండా హీరోయిన్ తో డ్యూయెట్స్ కూడా పాడిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ కి ముహూర్తం ఖరారు చేసారు. సహనా సహనా అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో డార్లింగ్ లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు.
పాన్ ఇండియా బ్యాచిలర్ అంటూ వచ్చిన మొదటి సాంగ్ లో డార్లింగ్ లుక్, డ్యాన్స్ ఎంత మాస్ గా ఉన్నాయో.. ఈ సాంగ్ లో అంత క్లాస్ గా.. క్యూట్ గా కనిపించాయి. శరత్ చంద్రికా తేజ యామిని.. నిలోద్బలనివే మందగామిని.. ప్రమద్ దీపికా హంసవాహినీ.. కదిలే దేవత స్త్రీవే అంటూ వచ్చే లిరిక్స్ ని డార్లింగ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అద్భుతంగా ఆలపించాడు. ఇక ఆ దేవత స్త్రీగా నిధి అగర్వాల్ కనిపించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. మొదటిసారి నిధి అందాలను కూడా డార్లింగ్ డామినేట్ చేశాడు అని చెప్పొచ్చు. ఆ లుక్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రభాస్ అదరగొట్టేశాడు.
వింటేజ్ డార్లింగ్ ని చూసినట్లు ఉందని రెబల్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక రొమాంటిక్ సాంగ్స్ కి థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెల్సిందే. ఇక సహనా సహనా ఫుల్ వీడియో సాంగ్ డిసెంబర్ 17 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రోమోని బట్టి మొదటి సాంగ్ కంటే రెండో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. మరి ది రాజా సాబ్ సినిమాతో డార్లింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.