Rural Love Story: గ్రామీణ ప్రేమకథ
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:25 AM
యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న వైవిధ్య గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉసురే’. నవీన్ డి. గోపాల్ దర్శకత్వంలో మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించారు...
యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న వైవిధ్య గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉసురే’. నవీన్ డి. గోపాల్ దర్శకత్వంలో మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించారు. టీజయ్ అరుణాచలం, జననీ కునశీలన్ జంటగా నటించారు. నటి రాశీ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 1న ‘ఉసురే’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అని చెప్పారు.