Viral: మణిరత్నం, నవీన్ పొలిశెట్టి, రుక్మిణి.. భలే కాంబినేషన్!
ABN , Publish Date - May 22 , 2025 | 07:06 PM
సౌత్‌లో ఓ ఆసక్తికర కాంబినేషన్ పట్టాలెక్కనున్నట్లు గత మూడు నాలుగు రోజులుగాసోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సౌత్‌లో ఓ ఆసక్తికర కాంబినేషన్ పట్టాలెక్కనున్నట్లు గత మూడు నాలుగు రోజులుగాసోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే కమల్ హసన్‌తో 35 యేండ్ల తర్వాత జట్టు కట్టి థగ్ లైఫ్ (Thug life) సినిమాను రూపొందించిన లెజండ్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) ఇప్పుడు ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా అనంతరం ఆయన తీయబోయే కొత్త చిత్రంలో టాలీవుడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. ‘అలైపాయుదే’, ‘ఒకే కణ్మణి’ తరహాలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా కన్నడ భామ లేటెస్ట్ సెన్షేషన్ రుక్మిణీ వసంత్ (RukminiVasanth)ను సెలక్ట్ చేసినట్లు నెట్టింట వార్తలు హాల్‌చల్ చేస్తున్నాయి. సుమారు 30 సంవత్సరాల తర్వాత మణిరత్నం తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. కాగా ఈ కాంబోపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకునే ఈ చిత్రాన్ని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం తర్వాత యాక్సిడెంట్‌తో సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ (Naveen Polishetty) కోలుకుని తన పెండింగ్‌లో ఉన్న సినిమాలపై షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలు పూర్తైన తర్వాత నవీన్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఇదిలాఉండగా రుక్మిణి వసంత్ (RukminiVasanth), విజయ్ సేతుపతి జంటగా నటించిన ‘ఏస్’ శుక్రవారం విడుదలవుతుండగా మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించే చిత్రంలో నటిస్తున్నారు.