Roshan, Sailesh: శైలేష్ డైరెక్ష‌న్‌లో రోష‌న్‌.. భ‌లే సెట్ చేశారుగా!

ABN , Publish Date - Jun 03 , 2025 | 10:45 AM

తెలుగునాట ఓ ఆస‌క్తిక‌ర కాంబినేష‌న్ ప‌ట్టాలెక్క‌నుంది. ఇందుకు సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

roshan

తెలుగునాట ఓ ఆస‌క్తిక‌ర కాంబినేష‌న్ ప‌ట్టాలెక్క‌నుంది. ఇందుకు సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌ రావు దిశా నిర్దేశంలో వ‌చ్చిన పెళ్లి సంద‌డి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి న‌ట‌న‌, డ్యాన్సుల ప‌రంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ కుమారుడు రోష‌న్ (Roshan Mekha). ఆ సినిమా త‌ర్వాత చాలా విరామం తీసుకున్న రోష‌న్ ఇటీవ‌ల లైన్‌లోకి వ‌చ్చి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్ప‌టికే మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ సినిమాలో కీల‌క పాత్ర చేస్తున్న రోష‌న్ (Roshan Mekha) తెలుగులో మ‌లి ప్ర‌య‌త్నంగా అశ్వ‌నీద‌త్ కూతురు స్వ‌ప్న నిర్మాణంలో ఛాంఫియ‌న్ (Champion) అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ (Sithara Entertainment) బ్యాన‌ర్‌లోనూ ఓ చిత్రం చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

FrJqn5sXsAA_npB.jpeg

హిట్ వ‌ర్స్‌ సినిమాల ద‌ర్శ‌కుడు డా. శైలేష్ కొల‌ను (Sailesh Kolanu) ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మూవీ ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే శైలేష్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన సినిమాల్లో వ‌య‌లెన్స్ ఎంత కీల‌క పాత్ర పోషిస్తుందో ఆ చిత్రాల్లో హీరో హీరోయ‌న్ల మ‌ధ్య ప్రేమ దృశ్యాలు ఉండేవి కొద్ది నిమిషాలే అయినా హృద్యంగా తెర‌కెక్కిస్తాడ‌నే కితాబు ఉంది.

అందుకు ఉదాహార‌ణ‌గా చూయి ఇటీవ‌లి హిట్‌3 సినిమాలో నాని, శ్రీనిధి షెట్టిల మ‌ధ్య వ‌చ్చిన పాట‌ను చాలా మంది చూయిస్తారు. కాగా ప్ర‌స్తుతం ఈ చిత్రానికి స‌బంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాలను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఫ్రాజెక్ట్‌పై బ‌జ్ ప్రారంభ‌మైంది.

Updated Date - Jun 03 , 2025 | 10:46 AM