Roshan Kanakala: మోగ్లీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది...

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:44 AM

రోషన్ కనకాల హీరోగా నటించిన తొలి చిత్రం 'బబుల్ గమ్'కు అప్పట్లో 'ఎ' సర్టిఫికెట్ లభించింది. అతని రెండో సినిమా 'మోగ్లీ'కి సైతం అదే సర్టిఫికెట్ వచ్చింది. సందీప్ రాజ్ దర్శకత్వంలో 'మోగ్లీ' మూవీని టీజీ విశ్వప్రసాద్ డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు.

Mowgli Movie

రోషన్ కనకాల హీరో కాకముందు ఒకటి రెండు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. అందులో 'నిర్మలా కాన్వెంట్' కూడా ఒకటి. అందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించాడు. ఇదిలా ఉంటే రోషన్ కనకాల సోలో హీరోగా నటించిన తొలి చిత్రం 'బబుల్ గమ్'. రెండేళ్ళ క్రితం డిసెంబర్ 29వ తేదీ ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రోషన్ అమ్మమ్మ పి. విమల దీనికి మెయిన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రోషన్ తొలిసారి హీరోగా నటించిన 'బబుల్ గమ్'కు అప్పట్లో 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది. సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ డోస్ కు మించి ఉండటంతో అప్పటి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దర్శకుడు రవికాంత్ పేరెపు, రోషన్ మదర్ సుమ... 'ఎ' సర్టిఫికెట్ ను ఇష్టపడి తీసుకున్నారు సినిమా కంటెంట్ ను కట్ చేయడం ఇష్టం లేక! ఇప్పుడు చిత్రంగా రోషన్ హీరోగా నటించిన రెండో సినిమా 'మోగ్లీ'కీ 'ఎ' సర్టిఫికెటే వచ్చింది. ఈ తాజా చిత్రం నిడివి 2.40 నిమిషాలు.


రోషన్ కనకాల, సాక్షి జంటగా నటించిన ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పూర్తి స్థాయిలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అయితే... డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' కారణంగా వాయిదా పడింది. అయితే... తాజాగా చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా ప్రీమియర్స్ ను 12వ తేదీ రాత్రి వేసి, మూవీని 13వ తేదీ విడుదల చేస్తున్నట్టు తెలిపింది.

Updated Date - Dec 10 , 2025 | 11:53 AM