Mowgli Trailer: నువ్వేమైనా ప్రభాస్ అనుకుంటున్నావా.. అదిరిపోయిన మోగ్లీ ట్రైలర్
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:51 PM
యాంకర్ సుమ (Suma) కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డ్ ను అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోగ్లీ(Mowgli).
Mowgli Trailer: యాంకర్ సుమ (Suma) కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డ్ ను అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోగ్లీ(Mowgli). ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మండోద్కర్ నటిస్తుండగా.. నటుడు, దర్శకుడు అయిన బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 12 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ని బట్టి ఇదొక మోడ్రన్ రామాయణం అని తెలుస్తోంది. సీతారాముల ప్రేమకథ.. సీతను కోరుకొనే రావణుడు.. రాముడికి, రావణుడికి యుద్దం.. రాముడి కోసం ఏదైనా చేసే హనుమంతుడు. ఈ పాత్రలన్నింటిని ఈ సినిమాలో చూపించాడు సందీప్ రాజ్. ఇక కథ విషయానికొస్తే.. హీరో జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడే జూనియర్ డ్యాన్సర్ గా ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. హీరోయిన్.. చెవిటి- మూగ కావడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది.
ఇక అమ్మాయి ఏలా ఉన్నా తన కన్ను పడితే కచ్చితంగా అది తనదే అని, ఎలా అయినా సొంతం చేసుకోవాలని విలన్ అయిన పోలీస్.. హీరోను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్నీ రకాలుగా ఇబ్బంది పెడతాడు. అయినా హీరో ప్రేమ కోసం యుద్దం చేస్తాను అంటాడు. మరి ఈ ప్రేమ యుద్దంలో సీతారాములాంటి ఈ జంట కలిసిందా.. ? ఈ ప్రేమను గెలిపించడానికి ఎవరు వచ్చారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అడవి నేపధ్యంలో సాగే ప్రేమ కథ కావడంతో అక్కడక్కడ జయం, అహింస లాంటి సినిమా ఛాయలు కనిపిస్తాయాయి. ట్రైలర్ ని బట్టి బండి సరోజ్ నటన సినిమాకు హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఇక కాలభైరవ మ్యూజిక్ కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాలనే ఉంది. మరి ఈ సినిమాతో రోషన్ కనకాల ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.