Champion: రోష‌న్‌.. ఛాంపియ‌న్ ట్రైల‌ర్ అదిరింది! యాక్ష‌న్ సీన్స్.. మాములుగా లేవుగా

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:07 PM

రోష‌న్ మేక, అన‌శ్వ‌ర రాజ‌న్ జంట‌గా ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం ఛాంపియ‌న్.

Champion

రోష‌న్ మేక (Roshan), అన‌శ్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan) జంట‌గా ప్ర‌దీప్ అద్వైతం (Pradeep Advaitham ) ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన చిత్రం ఛాంపియ‌న్ (Champion). 1947 భార‌త దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టికీ నిజాం పాల‌న‌లోని హైద‌రాబాద్ రాష్ట్రానికి ఫ్రీడం రాలేదు.

నాటి నిజాం హ‌యాంలోని బైరాన్‌ప‌ల్లి గ్రామంలో ర‌జాకార్లు ఏలాంటి దురాఘాతాల‌కు పాల్ప‌డ్డారు, నాటి ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎంత దుర్భ‌రంగా ఉండేది, అలాంటి ప‌రిస్థితుల నుంచి వ‌చ్చిన ఓ యువ‌కుడు ఫుట్‌బాల్ ఛాంఫియ‌న్‌గా ఎలా ఎదిగాడనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో సినిమా తెర‌కెక్కింది.

ఈ చిత్రం డిసెంబ‌ర్ 25న పాన్ ఇండియాగా థియేట‌ర్లకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం విశేషం.

ఈ ట్రైల‌ర్‌ను చూస్తే.. లోప‌ల మ్యాట‌ర్ సాలీడ్‌గానే ఉన్న‌ట్లు ఫీల్ వ‌చ్చేసింది. అంతేకాకుండా ఇప్స‌టివ‌ర‌కు రివీల్ చేయ‌ని స్టార్ క్యాస్ట్ భారీగానే తెర‌పై ద‌ర్శ‌ణ‌మిచ్చి షాకిచ్చారు. కోవై స‌ర‌ళ ద‌గ్గ‌రి నుంచి మొద‌లు పెట్టి, అల‌నాటి హీరో క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి , హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న‌ తెలుగ‌మ్మాయి అవంతిక వంద‌న‌పు, బాలీవుడ న‌టుడు కేకే మీన‌న్ వంటి వారు స‌డ‌న్ ఎంట్రీల‌తో అద‌ర‌గొట్టారు. వీరితో పాటు నిరీక్ష‌ణ ఈశ్వ‌రీ, వెన్నెల కిశోర్, సీనియ‌ర్ న‌రేశ్‌ల‌కు మంచి పాత్ర‌లు ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఇక యాక్ష‌న్ స‌న్నివేశాలు సైతం హాలీవుడ్ స్టైల్‌లో తీసిన‌ట్లు తెలుస్తోండ‌గా, మిక్కీ జే మేయ‌ర్ (Mickey J Meyer) సంగీతం అంత‌కుమించి అనే త‌ర‌హాలో ఉండి అదిరిపోయింది. ట్రైల‌ర్‌ను చూస్తే సినిమా ఏదో మ్యాజిక్ చేయ‌బోతుంద‌నే ల‌క్ష‌ణాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఇప్పుడే ఆ ట్రైల‌ర్ చూసేయండి మ‌రి.

Updated Date - Dec 18 , 2025 | 11:07 PM