RK Roja: స్టార్ హీరో కొడుకుతో నా కూతురు పెళ్లి.. అతనెవరో నాకైనా చెప్పండి
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:44 PM
ఆర్కే రోజా (RK Roja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా ఆమె ఎంత గుర్తింపు తెచ్చుకుందో.. రాజకీయ నాయకురాలిగా అంతకన్నా ఎక్కువ గుర్తింపును తెచ్చుకుంది.
RK Roja: ఆర్కే రోజా (RK Roja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా ఆమె ఎంత గుర్తింపు తెచ్చుకుందో.. రాజకీయ నాయకురాలిగా అంతకన్నా ఎక్కువ గుర్తింపును తెచ్చుకుంది. ఇక వివాదాలు, విమర్శలు రోజాకు కొత్తేమి కాదు. ప్రస్తుతం రోజా రాజకీయాలకు దూరంగా ఉంది. ఆమె గురించి పక్కన పెడితే.. ఆమె కూతురు అన్షు మాలిక (Anshu Malika) ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. గత కొన్నిరోజులుగా అన్షు మాలిక.. ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్తుందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత అన్షుని హీరోయిన్ చేయడం కోసం రోజా విశ్వప్రయత్నాలు చేస్తుందని రూమర్స్ వచ్చాయి.
అన్షు.. తల్లిని మించిన అందంతో మెరిసిపోతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న అన్షు.. హీరోయిన్ ఎంట్రీ ఇస్తే మంచి భవిష్యత్ కూడా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. తమిళ్ లో కుర్ర హీరోల సరసన ఆమె చక్కగా సరిపోతుందని, మొదట కోలీవుడ్ లోనే ఈ చిన్నది ఎంట్రీ ఇస్తుందని మాట్లాడుకున్నారు. తాజాగా ఈ రూమర్స్ కు రోజా చెక్ పెట్టింది. ఈ రెండు వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రోజా తన కూతురుపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించింది.
'నా కూతురు అన్షు మాలిక.. స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్తుందని రూమర్స్ వస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో నాక్కూడా చెప్తే బావుంటుంది. ఇక అన్షును హీరోయిన్ గా చేస్తున్నా అంటూ వార్తలు వచ్చాయి. అందులో కూడా నిజం లేదు. తను ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని కలలు కనలేదు. సైంటిస్ట్ అవ్వాలని ఆశపడుతోంది. దానికోసమే విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తుంది. నా పిల్లలకు ఎప్పుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాను. వారికి ఏది కావాలని ఉంటే అదే అవుతారు. నా కోరికలను వారిపై రుద్డను. తాను హీరోయిన్ అవ్వాలని ఉంది అంటే అప్పుడు ఆలోచిస్తాను. అన్షు చదువులోనే కాదు.. పేదవారికి సహాయం చేయడంలో కూడా ముందు ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చింది.