NTR Pragathi Shetty: ఎన్టీఆర్ మా అన్నయ్య.. స్పీచ్ అదరగొట్టిన రిషబ్ శెట్టి భార్య

ABN , Publish Date - Sep 29 , 2025 | 07:16 AM

కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి భార్య ఎన్టీఆర్ గురించి చేసిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. “ఎన్టీఆర్ మా అన్నయ్య” అంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTR, Rishab Shetty

రిష‌బ్ శెట్టి (Rishab Shetty) హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం కాంతార చాప్ట‌ర్‌1 (Kantara Chapter 1). ఈ ఆక్టోబ‌ర్‌2న ప్రపంచ వ్యాప్తంగా థియేట‌ర్లలోకి రానుంది. ఈ నేప‌థ్యంలో హీరో, మేక‌ర్స్‌, సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే బెంగ‌ళూరు, ముంబైల‌లో ప్ర‌త్యేక ఈవెంట్లు నిర్వ‌హించిన చిత్ర బృందం తాజాగా హైద‌రాబాద్‌లో ఆదివారం రాత్రి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (Kantara Chapter 1 pre release event) నిర్వ‌హించింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (NTR) ముఖ్య అతిథిగా హ‌జ‌రయ్యారు.

అయితే.. కాంతారా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు ఆయన భార్య ప్ర‌గ‌తి శెట్టి (Pragathi Shetty) కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.. హైదరాబాద్‌లో జరిగిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ప్రసంగం అందరినీ కట్టిపడేసింది. ఆమె మాట్లాడుతూ 'ఎన్టీఆర్ మా అన్నయ్యలాంటి వారు. తెలుగు ప్రేక్షకుల నుంచి మాకు ఎప్పుడూ అపారమైన ప్రేమ లభిస్తుంది. ఆ ప్రేమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ రోజు మా సినిమా కోసం ఇంత పెద్ద స్థాయిలో సపోర్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు' తెలుగు ఆడియ‌న్స్ మా ఫ్యామిలీలో భాగం అంటూ భావోద్వేగంగా చెప్పింది.

ఈ స్పీచ్ విన్న వెంటనే అక్కడున్న అభిమానులు ఘనంగా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. రిషబ్ శెట్టి భార్య మాటల్లో ఉన్న నిజాయితీ, ఎన్టీఆర్‌పై చూపిన గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం కోసం రిష‌బ్‌ ఐదేండ్లుగా క‌ష్ట ప‌డుతున్నాడ‌ని మీ ఉత్సాహాం చూస్తుంటే అదంతా మ‌రిచేలా ఉంద‌ని అన్నారు. మొద‌టి సినిమాకు మంచి రెస్పాన్స్ ఇచ్చార‌ని ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని కొరుకుంటున్నాన‌ని తెలిపారు.

Updated Date - Sep 29 , 2025 | 07:16 AM