Kantara Chapter 1: కాంతార ఛాప్టర్1 .. ట్రైలర్ అదిరింది! హిట్ గ్యారంటీ
ABN , Publish Date - Sep 22 , 2025 | 01:48 PM
దేశ వ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురు చూస్తున్న రానే వచ్చింది కాంతార ఛాప్టర్1 .. ట్రైలర్ వచ్చేసింది.
దేశ వ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురు చూస్తున్న రానే వచ్చింది. కర్ణాటక నుంచి ఓ మాములు చిత్రంగా ప్రేక్షకుల ఎదుటకు వచ్చి సంచలన విజయంసాధించడంతో పాటు రికార్టు కలెక్షన్లు రాబట్టిన చిత్రం కాంతార. రిషబ్ షెట్టి (Rishab Shetty) స్వయంగా దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రం భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాలను తట్టి లేపిన చిత్రంగా ఈ చిత్రం పేరు గడిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ రెండేండ్ల పాటు అనేక అపసోపాలు పడి ఈ చిత్రం కాంతా ఛాప్టర్ 1 (Kantara Chapter 1) పూర్తి చేసి చెప్పినట్టుగానే ఆక్టోబర్ 2కు దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కు రెడీ చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తే.. గత సినిమాల మాదిరి థీమ్‌తో సాగుతూ.. గత చిత్రానికి ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకులకు మంచి హై ఇచ్చే అనే తరహాలోనే సాగింది. అల్రెడీ ఇప్పటికే రిలీజైన కాంతార సినిమాకు ఫ్రీ క్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హీరో తన తండ్రి అడవిలోకి వెళ్లి మాయమవగా ఆ తర్వాత కుమారుడు తన తండ్రిని వెతక్కుంటూ ఫారెస్ట్‌లోకి వెళ్లడంతో ట్రైలర్‌ను స్టార్ట్ చేసినవిధానం బాగుంది.
ఆపై అ బాలుడు కాంతారా అనే గ్రామంలో పెరిగి పెద్దవడం, చలాకీగా తిరుగుతూ అడవిలో మిత్రులతో సరదాగా గడుపుతూ తన తెగ మనషులతో జీవనం సాగిస్తుండడం, అక్కడి సరుకులను సమీపంలోని రాజ్యంలో అమ్మడం, హీరో రాకుమారుడిని ప్రేమించడం, రాజ వంశంకు చెందిన వారు కోపంతో ఆ గ్రామాలపై దాడులు చేయడం నేపథ్యంలోనే సినిమా ఉండనున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలను, ప్రకృతిని కాపాడడానికి ఎవరు వచ్చారు, అతని వెనుక ఉన్న రహాస్యం ఏంటి, ఎలా రక్షించారనే ఆసక్తికరమైన కథ కథనాలతో సినిమా మంచి ఎక్స్ ఫీరియన్స్ ఇవ్వడం ఖాయమనేలా ఉంది.
ఈ సినిమాను హోంబలే సంస్థ (Hombale Films) నే నిర్మించడగా అజినీష్ లోక్ నాథ్ సంగీతం మెస్మరైజిగ్ డెవోషన్ ఫీల్ ఇచ్చేలా ఉంది. ఇక విజువల్స్, నటుల ఫెర్మార్మెన్స్, అటవీ ప్రాంత పరిసరాలు సైతం మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. కథానాయికగా చేసిన రుక్మిణీ వసంత్ (Rukmini) గ్లామర్గా కనిపిస్తూనే నటనకు ఆస్కారమున్న పాత్ర దక్కినట్లు తెలుస్తుంది. ఇక ప్రతి నాయకుడిగా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah)చూపులతో నటించాడు. మొత్తంగా ఈ కాంతా ఛాప్టర్ 1 (Kantara Chapter 1) ట్రైలర్ చూస్తే ఈ పండుగకు ఇంటిల్లిపాదికి పంచభక్ష పరమాన్నాలు వడ్డించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఉంది. మీరు ఇంకా చూడకుంటే ఇప్పుడే చూసేయండి.