Kantara Chapter 1: కాంతారాకు.. ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌! టికెట్‌కు రూ.75, రూ.100 అద‌నం

ABN , Publish Date - Sep 30 , 2025 | 08:44 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కాంతారా: ఛాప్టర్ 1' అక్టోబర్ 2–11 వరకు టికెట్ ధరలు పెంచింది.

Kantara Chapter 1

రిష‌బ్ శెట్టి (Rishab Shetty) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన చిత్రం 'కాంతారా: ఛాప్టర్ 1 (Kantara Chapter 1). బుధ‌వారం ప్రీమియ‌ర్స్‌తో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. అక్టోబర్ 2 నుండి 11 వరకు థియేటర్లలో టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

Kantara

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: సాధారణ టికెట్ల ధరను రూ.75 వరకు, మల్టీప్లెక్స్ థియేటర్లలో: రూ.100 వరకు టికెట్ల ధ‌ర‌ను పెంచుకునేందుకు అనుమ‌తిని ఇస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ టికెట్ ధర పెంపును అనుమతించలేదు.

Updated Date - Sep 30 , 2025 | 08:45 PM