Riddhi Kumar: ప్రభాస్ చీర ఇవ్వడం వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:33 PM
రిద్ది కుమార్ (Riddhi Kumar).. ఈ పేరు తెలుగులో చాలా తక్కువమందికి తెలుసు. సంక్రాంతి తరువాత టాలీవుడ్ మొత్తం అమ్మడి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ది రాజా సాబ్ (The Raja Saab) సినిమాలో ఈ చిన్నది కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది.
Riddhi Kumar: రిద్ది కుమార్ (Riddhi Kumar).. ఈ పేరు తెలుగులో చాలా తక్కువమందికి తెలుసు. సంక్రాంతి తరువాత టాలీవుడ్ మొత్తం అమ్మడి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ది రాజా సాబ్ (The Raja Saab) సినిమాలో ఈ చిన్నది కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి కానుకగా ది రాజా సాబ్ జనవరి 9 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై రిద్ది.. తాను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది. డార్లింగ్ ఇప్పటివరకు హీరోయిన్లకు ఫుడ్ పెట్టడమే తప్ప గిఫ్ట్ లు ఇచ్చింది లేదు. మొదటిసారి హీరోయిన్ కి గిఫ్ట్ ఇవ్వడం ఏంటా.. ? అని అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ప్రభాస్ చీర గిఫ్ట్ ఇవ్వడం వెనుక కథ ఏంటి అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ కథను రిద్దినే రివీల్ చేసింది. 'మూడేళ్ళ క్రితం రాజా సాబ్ సెట్ లో అడుగుపెట్టినప్పుడే ప్రభాస్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన పుట్టినరోజు, దీపావళీ రెండు కలిసి వచ్చేసరికి యూనిట్ అందరికీ పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాకు ఆహ్వానం అందింది. కానీ, నేను ముంబైలో ఉండడంతో ఆ పార్టీకి వెళ్ళలేదు. ఆ తరువాత ప్రభాస్ కి నేను ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పా.
ప్రభాస్ లో నాకు ఎక్కువ కర్ణుడు కనిపిస్తాడు. ఆయనకు సంబంధించిన ఒక బుక్ ని నేను ప్రభాస్ కి గిఫ్ట్ చేశా. ఆ గిఫ్ట్ చూసి ఆయన చాలా సర్ ప్రైజ్ అయ్యి.. ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావో తెలుసా.. నాకు ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఆ తరువాత కల్కిలో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడంతో అప్పుడు నాకు అర్ధమయ్యింది ఆరోజు ఎందుకు ఆయన అంతలా ఆశ్చర్యపోయారో.. తరువాత షూటింగ్ జరుగుతున్న సమయంలో నా క్యార్ వాన్ లో వెళ్లాను. అక్కడ ఫ్లవర్స్, స్వీట్స్ పాకెట్స్ ఉన్నాయి. ప్రభాస్ గిఫ్ట్ పంపారు అని చెప్పారు. ఆయన గిఫ్ట్ అంటే చాక్లెట్స్ ఉంటాయని అనుకున్నాను. కానీ, పక్కనే ఎంతో అందమైన సబ్యసాచి చీరను చూసి నేను షాక్ అయ్యాను. ఆ చీరను ఈ ఈవెంట్ లో కట్టుకోవడానికి ఇన్నేళ్లు దాన్ని దాచి ఉంచాను. ఈరోజు నా కల నెరవేరింది' అంటూ చీర వెనుక స్టోరీ చెప్పుకొచ్చింది.