Su From So: సు ఫ్రమ్ సో.. తెలుగు ట్రైలర్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:37 AM
కన్నడనాట ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘సు ఫ్రమ్ సో’
కన్నడనాట ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘సు ఫ్రమ్ సో’ (Su From So). తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.. ఈనెల 8న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Distributors LLP) విడుదల చేస్తోంది. జేపీ తుమినాడ్ (JP Thuminad ) కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించారు.
షనీల్ గౌతమ్ (Shaneel Gautham), సంద్య అరకెరె (Sandya Arakere) ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్.బి.శెట్టి (Raj B Shetty), శశిధర్ శెట్టి బరోడా, రవిరాయ్ కలస నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనంతో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల పండగను అందింస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఇక్కడ కూడా బాగాఆలరించడం ఖాయమని అనిపిస్తుంది.