IPL Final: RCB విజ‌యం.. ఎగిరి గంతేసిన సినీ సెల‌బ్రిటీలు

ABN , Publish Date - Jun 04 , 2025 | 09:36 AM

17 సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ త‌ర్వాత ఆర్సీబీ ఐపీఎల్‌లో విజ‌య దుందుబి మ్రోగించడంతో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ అభిమానుల ఆనందాల‌కు అవ‌ధుల్లేకుండా పోయాయి.

rcb

17సంవ‌త్స‌రాలుగా ‘ఈ సాల కప్ నమదే..’ అంటూ చివ‌ర‌కి వ‌ర‌కు వ‌చ్చి ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల‌ను నిరూత్సాహా ప‌రుస్తూ వ‌చ్చిన ఆర్సీబీ ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో పంజాబ్‌ను మ‌ట్టి క‌రిపించి విజ‌య దుందుబి మ్రోగించిన విష‌యం తెలిసిందే. ఈ విజ‌యంతో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ అభిమానుల ఆనందాల‌కు అవ‌ధుల్లేకుండా పోయాయి.

దేశ వ్యాప్తంగా యువ‌త రోడ్ల‌పైకి వ‌చ్చి వ‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ను మించి సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ముఖ్యంగా బెంగ‌ళూరు, రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఈ హాడావుడికి ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్లు ఫ్యాన్స్ చెల‌రేగి పోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియా బ్రేక్ అయి స‌ర్వ‌ర్లు డౌన్ అయ్యేంత‌గా వైర‌ల్‌, రీ పోస్టులు అవుతూ సెన్షేష‌న్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈక్ర‌మంలో సాధార‌ణ పౌరుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం అమ సంతోషాన్ని ప‌ట్ట‌లేక ఎగిరి గంతేసిన‌ వీడియోలు సైతం ఇప్పుడు సామాజికి మాధ్య‌మాల్లో ద‌ర్శ‌ణ‌మిస్తూ ఆ విజ‌యానందాల‌కు మ‌రింత ఊపుపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ త‌న‌యుడు అయాన్ (Allu Ayan) సైతం ఇంట్లో #RCBvsPBKS మ్యాచ్ చూస్తూ ఆర్సీబీ విజ‌యం సాధించ‌డంతో ఎమోష‌న‌ల్ అయి ఎడ్చేడాశాడు ఆపై మీద నీల్లు చ‌ల్లుకుని ఫైన‌ల్లీ వ ఈడిడ్ ఇట్ అంటూ తండ్రి అర్జున్ ( Allu An)తో త‌న సంతోషాన్ని పంచుకున్నాడు.


మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ (Prasanth Neel).. ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌గా అక్క‌డే ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో RCBvsPBKS మ్యాచ్ చూసి టీం విజ‌యం సాధించ‌డంతో ఎగిరి గంతేసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట‌ తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ వాటి తిల‌కించండి. వీరే కాక ఇంకా చాలా మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతూ పోస్టులు పెట్టారు.

Updated Date - Jun 04 , 2025 | 11:24 AM