రెగ్యులర్‌ షూట్‌ షురూ

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:29 AM

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌...

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్‌ షూట్‌ను మొదలెట్టారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ప్రత్యేక సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజతో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఇది రవితేజ మార్క్‌ కామెడీతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. ఇందులో ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, డీఓపీ: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Updated Date - Jun 17 , 2025 | 02:31 AM