SS Rajamouli: రాజమౌళిపై వానరసేన ఫిర్యాదు.. మరోపక్క టైటిల్‌పై రచ్చ..
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:41 AM
టాలీవుడ్‌లో పరాజయం ఎరుగని దర్శకుడు రాజమౌళికి (SS rajamouli) వరుస చిక్కులు ఎదురవుతున్నాయి.
టాలీవుడ్‌లో పరాజయం ఎరుగని దర్శకుడు రాజమౌళికి (SS rajamouli) వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘వారణాసి’ (Varanasi) సినిమా టైటిల్స్ గ్లింప్స్ వేడుకలో జక్కన్న చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని రాష్ట్రీయ వానరసేన ఎస్‌ఎస్ రాజమౌళిపై సరూర్ నగర్ పోలీసుకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, రాజమౌళి పై కేసు నమోదు చేయాలని వినతి పత్రం అందజేశారు. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్టీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరారు.
వారణాసి ఈవెంట్లో రాజమౌళి వ్యాఖ్యలు..
నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో సాంకేతిక సమస్య తలెల్తింది. రాజమౌళి బాధతో పాటు అసహనానికి గురయ్యారు. స్టేజి మీద ఆయన మాట్లాడుతూ.. ‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడుతూ.. ‘టెన్షన్ పడకు. అంతా హనుమ చూసుకుంటాడు. వెనకుండి నడిపిస్తాడు’ అన్నారు. కానీ, సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్ ఆగినపుడు ఇలాగేనా నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. కానీ, ఎందుకిలా అయిందని నాకు కోపం వచ్చింది’ అని అన్నారు. ఇదిలా ఉండగా మరో చిక్కులో ఇరుక్కున్నారు రాజమౌళి.

హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదం కొనసాగుతుండగా ‘వారణాసి’ టైటిల్ పై ఫిల్మ్‌చాంబర్‌లో మరో నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ టైటిల్ తాను ఎప్పుడో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు