Rashmika Mandanna: కోరి తలనొప్పి తెచ్చుకోవడం అవసరమా

ABN , Publish Date - Nov 06 , 2025 | 03:54 PM

జగపతిబాబు (Jagapathibabu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న‘జయమ్ము నిశ్చయమ్మురా’( Jayammu Nischayammu Ra) కార్యక్రమంలో పాల్గొన్నారు రష్మిక మందన్న

జగపతిబాబు (Jagapathibabu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న‘జయమ్ము నిశ్చయమ్మురా’( Jayammu Nischayammu Ra) కార్యక్రమంలో పాల్గొన్నారు రష్మిక మందన్న. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో జగపతి బాబు అడిగిన ప్రశ్నలకు రష్మిక సరదా సమాధానాలిచ్చారు. నవంబర్‌ 7న విడుదల కానున్న తన సోలో సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'  గురించి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. క్రష్‌ గురించి అడగ్గా 'మీ బ్లాంక్స్ మీరే పూర్తి చేసుకోవాలని నవ్వుతూ అంది.  ఆడియన్స్‌ వైపు చూస్తూ ‘మీలో ఎవరైనా విజయ్‌ అనే పేరున్న వాళ్లు ఉన్నారా’ అంటూ ఆట పట్టించారు. (Rowdy gym)

రష్మిక చేసే అల్లరి పనులు చెప్పమని జగపతి బాబు అడగ్గా ‘వద్దు సర్‌.  నేను చెబితే వాళ్లు ఇష్టమొచ్చినట్లు  రాస్తారు. కోరి తలనొప్పి తెచ్చుకోవడం అవసరమా చెప్పండి’ అని సమాధానమిచ్చింది. 'ఎప్పుడైనా కలవాలంటే జిమ్‌కు రండి, ‘రౌడీ’జిమ్ అని ఒకటి ప్రారంభిస్తా. నేనే అందరికీ ట్రైనర్‌గా ను' అని చెప్పింది రష్మిక. 

Updated Date - Nov 06 , 2025 | 03:55 PM