Rashmika Mandanna: మరో హారర్ జానర్ చిత్రంలో నేషనల్ క్రష్..
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:26 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ఇటీవలే ‘కుబేర’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది బెంగళూరు బ్యూటీ.
నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) మందన్నా దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ఇటీవలే ‘కుబేర’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది బెంగళూరు బ్యూటీ. ఈ దీపావళికి ‘థామా’(Thama) తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఆయుష్మాన్ ఖురానాతో ఆమె నటించిన హారర్ లవ్‌స్టోరీ ఇది. అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజా సమచారం ప్రకారం రష్మిక హిట్ హారర్ ప్రాంఛైజీల చిత్ర విషయంలోనూ రష్మిక పేరు వినిపిస్తోంది.
‘కాంచన’ సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన రాఘవ లారెన్స్.. ప్రస్తుతం ‘కాంచన 4’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! లారెన్స్ హీరోగా నటిస్తూ.. తెరకెక్కిస్తున్న చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో పూజా హెగ్డే, నోరా ఫతేహి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో రష్మికను ఓ ప్రత్యేక పాత్ర కోసం చిత్ర బృందం సంప్రదించారని తెలిసింది. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయట. ప్రస్తుతం రష్మిక నటించిన తెలుగు సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూడా విడుదలకు సిద్ధమవుతుంది.