Rashmika Mandanna: ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు.. ఎవ‌రిదంటా గురువు గారు

ABN , Publish Date - May 30 , 2025 | 10:34 AM

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.

Rashmika Mandanna

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక (Rashmika Mandanna) మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, తాజాగా ఎల్లో శారీలో దిగిన ఫొటోలు వాటి గురించి ర‌ష్మిక చెప్పిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

GsCp01caQAAaFLv.jpg

ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) ల‌వ్‌లో ఉన్నారు.. ఏ క్ష‌ణంలోనైనా పెళ్లి పీట‌లు ఎక్కుతార‌నే వార్త‌లు ఎలాగో ఉన్నాయి. అంతేగాక‌ త‌రుచూ ఇద్ద‌రు ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేకుండా ఒకే లొకేష‌న్‌ ఫొటోలు షేర్ చూస్తూ నెటిజ‌న్ల‌కు దొరికి పోతుంటారు.తాజాగా ఇలాంటి ఫొటోలే మ‌రోసారి వైర‌ల్ అయ్యాయి.

GsCp06yaoAAq_PI.jpg

రీసెంట్‌గా ర‌ష్మిక (Rashmika Mandanna) ప‌సుపు ప‌చ్చ చీర ధ‌రించి ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌ల సినిమా లాంచింగ్‌కు ముఖ్య‌ అతిథిగా హ‌జ‌రైన‌ సంగ‌తి విధిత‌మే. ఆపై ఆదే చీర‌పై ఫొటోషూట్ చేయుంచుకున్న ర‌ష్మిక ఈ ఫొటోల‌లో నాకు ఇచ్చినవి, విలువైనవి అన్నీ ఉన్నాయి. ఇష్టమైన రంగుల చీర, గిఫ్ట్‌గా ఇచ్చిన స్పెషల్ లేడీ, ఈ ఫొటోలు తీసిన వ్యక్తి, ఇష్టమైన ప్లేస్ అన్నీ ఉన్నాయి అంటూ క్యాప్షన్ పెట్టింది.

GsJGdjUXoAABBQi.jpg

ఇంకేముంది విజ‌య్ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) అభిమానుల‌తో పాటు చాలామంది త‌మ బుర్ర‌ల‌కు, త‌మ అకౌంట్ల‌కు ప‌ని చెప్పి సోష‌ల్ మీడియాల్లో త‌మ స్టైల్ క్రియేటివిటీలతో హాల్‌చ‌ల్ చేశారు. ఆ ఫోటోలు విజ‌య్ ఇంట్లోనే దిగిన‌వ‌ని, వాటిని విజ‌య్ స్వ‌యంగా తీశాడ‌ని, ఆ చీర‌ను విజ‌య్ అమ్మ‌గారు బ‌హూమ‌తిగా ఇచ్చారంటూ కామెంట్లు చేస్తూ హోరెత్తించారు.

rashmika.jpg

గ‌తంలోనూ ఆ ఫొటోలో ఉన్న‌ బ్యాగ్రౌండ్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం క‌లిసి దిగిన ఓ పాత‌ చిత్రం ఉండ‌డంతో ఈ ఫొటోపై చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. ఇక‌నైనా విజ‌య్‌, ర‌ష్మిక‌లు త‌మ రిలేష‌న్‌ను బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌ని, ఇంకా ఎన్నాళ్లు దాచుతారంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

GsCp0yibQAAxY8s.jpg

Updated Date - May 30 , 2025 | 10:34 AM