Rashmika Mandanna: ఎవర్నో సంతోషపెట్టాలనే భారాన్ని మోయకండి

ABN , Publish Date - May 31 , 2025 | 03:53 PM

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన అప్‌డేట్‌లతోపాటు అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్‌ కూడా చెబుతుంటారు.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన అప్‌డేట్‌లతోపాటు అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్‌ కూడా చెబుతుంటారు. ఇటీవల ఛావా(Chhavva) సినిమాతో హిట్‌ అందుకుంది. తదుపరి విడుదలైన సికందర్‌ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తాజాగా ఆమె మాట్లాడుతూ "జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థం చేసుకుంటే ఒత్తిడి ఉండదు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది" అన్నారు.  

‘‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం నాకు తెలుసు. గతంలోనూ నేను ఇదే అంశం గురించి పలుమార్లు మాట్లాడాను. ఒకరోజు మనకు అనుకూలంగా అనిపిస్తుంటుంది. మరుసటి రోజు అంతా మారిపోతుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కుటుంబం, ేస్నహితుల నుంచి మద్దతు ఉండడం నా అదృష్టం. వారు నాకు ఎప్పుడూ అండగా ఉంటారు. నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రంగంలోకి రావడానికి ప్లాన్‌ కూడా చేసుకోలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంత అదృష్టవంతురాలినో అర్థమవుతుంది. కెరీర్‌ విషయంలో నేను ఎప్పుడూ స్థిరంగా ఉంటాను. అందరికీ ఇచ్చే సలహా కూడా ఇదే. మనసుకు నచ్చిన పని చేయాలి. కూర్గ్‌ లాంటి చిన్న పట్టణంలో పుట్టిన నేను.. ఈ స్థాయిలో ఉన్నానంటే అదే కారణం. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగాలి. ఈ ప్రయాణంలో కఠినమైన పాఠాలు ఉండవు.. అన్నీ విలువైనవే ఉంటాయి. ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇతరులను సంతోషపెట్టాలనే భారాన్ని మాత్రం మోయకండి. మీ ఆనందమే మీకు ముఖ్యం’’ అని రష్మిక చెప్పారు.  

Updated Date - May 31 , 2025 | 03:53 PM