Rashmika and Dikshith: బ్యూటిఫుల్ మెలోడీ
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:11 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ద గర్ల్‌ఫ్రెండ్’. ‘చి ల సౌ’తో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం...
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ద గర్ల్‌ఫ్రెండ్’. ‘చి ల సౌ’తో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నెల 16న సినిమా నుంచి ‘నదివే’ అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ బ్యూటిఫుల్ మెలోడీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్.