Ranveer Singh: కాంతారా.. దయ్యాలు! రణవీర్‌పై మండి పడుతున్న కర్ణాటక
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:09 AM
'కాంతార' చిత్రం లో పాత్రల పై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రణ్‌వీర్ (Ranvir singh) కన్నడిగుల ఆగ్రహానికి లోనయ్యారు.
రిషబ్‌శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ (kantara movie) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. వసూళ్ల వర్షమే కాకుండా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో కర్ణాటక సంప్రదాయాలు కనిపిస్తాయి. ఇందులో పంజుర్లీ దేవతపై తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
అయితే దీనిపై తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రణ్‌వీర్ (Ranvir singh) కన్నడిగుల ఆగ్రహానికి లోనయ్యారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి-IFFI) వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ పాల్గొన్నారు.
‘కాంతార’ సిరీస్ చిత్రాలపై ప్రశంసల వర్షం కురిపించారు. 'నన్ను 'కాంతార -3'లో చూడాలనుకుంటున్నారా. అయితే రిషబ్ కి నా గురించి చెప్పండి. ఈ చిత్రంలో రిషబ్ నటన అవుట్ స్టాండింగ్ గా ఉంది' అన్నారు
తదుపరి ‘కాంతార’ చిత్రంలో రిషబ్ శెట్టి చేసిన గులిగా దైవం సోదరి చౌండీ పాత్రను ఫీమేల్ ఘోస్ట్ (ఆడ దెయ్యం) అని అన్నాడు. ఆ క్యారెక్టర్ మాదిరి కళ్లను వంకరగా పెట్టి నాలుక బయటకు చూపిస్తూ ఆ పాత్రను అనుకరించాడు.
అంతే కాదు ‘హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయి’ అని అన్నాడు. ఇప్పుడు అతని వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. కన్నడిగులు ఆగ్రహానికి లోనయ్యారు రణ్‌వీర్. ఆ ప్రాంత ఇలవేల్పును అలా పోల్చడం సరికాదని రణ్‌వీర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ ఇష్యూ రణవీర్‌ను ఒత్తిడికి గురిచేస్తోంది. మరి అతను క్షమాపణ చెబుతాడా? లేదా? అనేది చూడాలి. అయితే కొందరు మాత్రం రణ్‌వీర్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఆయనకు తెలియక అలా మాట్లాడాడు.. తెలిసి పోరపాటు చేయలేదు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.