Rana Daggubati: చట్టం ముందు ఎవరూ అతీతులు కారు..
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:57 PM
ఎవరైనా సరే చట్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రానా దగ్గుబాటి అన్నారు.
ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రానా దగ్గుబాటి (Rana daggubati) అన్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కొందరు సెలబ్రిటీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అందులో రానా కూడా ఒకరు. నవంబరులో సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారాయన. దీని గురించి ప్రశ్నించగా చట్టబద్థమైన యాప్ (betting apps) అని తెలుసుకున్నాకే ప్రచారం చేసినట్లు విచారణ అనంతరం మీడియాకు తెలిపారు. ఆ ఈవెంట్ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రానా మాట్లాడుతూ ‘చట్టం ముందు ఎవరూ అతీతులు కారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. నేను ఓ ప్రొడక్షన్‌కు ప్రచారం చేయాలంటే దాని క్వాలిటీ తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని ప్రచారం చేస్తాను’ అని రానా అన్నారు.
నటుడిగానే కాక నిర్మాతగానూ రానా బిజీగా ఉన్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా ఆయన నిర్మించిన ‘కాంత’ గత నెల విడుదలైంది. అందులో రానా కీలక పాత్ర పోషించారు. శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న ‘పరాశక్తి’లో కీలక రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.