Rana Daggubati: రానాకు మరోసారి ఈడీ నోటీసులు

ABN , Publish Date - Jul 24 , 2025 | 05:39 AM

బెట్టింగ్‌ యాప్‌ల కేసులో నటుడు దగ్గుబాటి రానాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

బెట్టింగ్‌ యాప్‌ల కేసులో నటుడు దగ్గుబాటి రానాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇదివరకు నోటీసు జారీ చేసిన సమయంలో వేరే ప్రాంతంలో సినిమా షూటింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనంటూ ఆయన ఈడీ అధికారులకు తెలిపారు. వచ్చే నెల 11న ఈడీ కార్యాలయంలో విచారణకు తప్పకుండా హాజరుకావాలని తాజా నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నటులు ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మికి సైతం ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పలు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు.. 28 మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ నటులు, కొన్ని బెట్టింగ్‌ కంపెనీలపై ఈసీఐఆర్‌ నమోదు చేశారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన డబ్బు ఏ విధంగా అందిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Updated Date - Jul 24 , 2025 | 05:39 AM