Rana: ఎన్టీఆర్ తో భల్లాలదేవ ఢీ

ABN , Publish Date - Jul 04 , 2025 | 07:05 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనిక్ కాన్సెప్ట్ లకు క్రేజ్ పెరుగుతోంది. భాషా భేదాలు లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు ఆ బాట పట్టగా... ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా వచ్చి చేరుతున్నాడు. తాను కూడా ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు.

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. కథేమిటో.. బ్యాక్ డ్రాప్ ఏమిటో తెలియకపోయినా సరే.. వారు కలసి పనిచేస్తే చాలు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అలాంటిదే డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram ), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కాంబో. ఈ జోడీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర మోత మోగాల్సిందే. త్వరలో అలాంటి బీభత్సం సృష్టించేందుకు రెడీ అవుతున్న తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే వారు చేయనున్న సినిమా జానర్ ఏంటో తెలిసి పోవడంతో నందమూరి అభిమానులు ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఓ పౌరాణికమని, అందులో యన్టీఆర్ కార్తికేయునిగా నటిస్తున్నారని తెలుస్తోంది. పౌరాణికాలు అంటే నందమూరి ఫ్యామిలీకి బాగా అచ్చివచ్చేవి కాబట్టి ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. ఇప్పుడు అంతకు మించిన మ్యాటర్ బయటకు రావడంతో మరింత ఆసక్తి నెలకొంది.


ప్రెజెంట్ యంగ్ టైగర్ 'వార్ 2' (War2)తో పాటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీల తర్వాత త్రివిక్రమ్ తో భారీ మైథాలజికల్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్... సుబ్రమణ్య స్వామి గాథ ఆధారంగా రూపొందిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ మధ్య ఎయిర్​పోర్ట్​లో ఎన్టీఆర్ 'మురుగన్' పుస్తకం చేతిలో పట్టుకొని కనిపించిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో లో రానా (Rana) విలన్ గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. శక్తిమంతమైన స్వామిజీ గెటప్ లో భల్లాలదేవ కనిపించనున్నాడని టాక్. మామూలుగానే పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కు రానా కేరాఫ్. బాహుబలి (Baahubali), భీమ్లా నాయక్ (Bheemla Nayak ), వేట్టయాన్ (Vettaiyan)లో నటించి తన మార్క్ ను చాటుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో అంతకు మించి రోల్ చేస్తున్నాడట. ఇప్పటికే గురూజీ రానాను అప్రోచ్ అయ్యాడని... నటించేందుకు రానా సైతం ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు వినికిడి. మరి ఫస్ట్ టైం రూట్ మారుస్తున్న త్రివిక్రమ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Updated Date - Jul 04 , 2025 | 07:05 PM