Ramya Krishna: నా జీవితంలో జరిగిన మ్యాజిక్స్ అది
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:49 PM
జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) హాజరై సందడి చేశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు షేర్ చేశారు.
జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు నటి రమ్యకృష్ణ (Ramya Krishnan) హాజరై సందడి చేశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు షేర్ చేశారు. ‘బాహుబలి’లో శ్రీదేవి పోషించాల్సిన పాత్రలో నువ్వు యాక్ట్ చేశావ్’ అని జగపతి బాబు (Jagapathibabu) అడగగా ఆమె స్పందించారు. ‘ఆ విషయం నాకు తెలియదు. ‘బాహుబలి’లో (Bahubali) భాగమవడం నా అదృష్టం. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని మ్యాజిక్స్ జరుగుతుంటాయి. నా విషయంలో ఈ సినిమా అలాంటిదే. ఏదేమైనా శ్రీదేవి (Sridevi) నా అభిమాన నటి' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్ననిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించడం డెస్టినీ. ఆ రోల్‌లో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము' అన్నారు.
ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో ఈ నెల 31న ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.