Peddi: పెద్ది మరో అప్టేట్.. భారీ యాక్షన్ సీన్ల చిత్రీకరణ
ABN, Publish Date - May 22 , 2025 | 03:18 PM
హనుమ జయంతిని పురస్కరించకుని గురువారం పెద్ది మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది.
రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. మిర్జాపూర్ ఫేం దివ్యేందు (divyenndu) కీలక పాత్రలో నటిస్తుండగా గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అస్కార్ విన్నర్ రెహామాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం విడుదల చేసిన‘పెద్ది గ్లింప్స్’ (Peddi Glimpse) యావత్ ఇండియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ గ్లిమ్స్‌లో రామ్‌చరణ్ పాత్ర ఏవిధంగా ఉండనుందో చూపించారు. ‘ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడతామా ఏటి మళ్లీ!’ అంటూ ఆయన ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్‌లు అందరితో ఈలలు వేయించాయి. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్‌ను ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఢిల్లీ కాపిటల్స్ ఆ సీన్‌ను రీ క్రియేట్ చేయగా నేషనల్ లెవల్‌లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హనుమ జయంతిని పురస్కరించకుని గురువారం ఈ పెద్ది మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది.
ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోందని, ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్సులతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్‌లో చరణ్ (Ram Charan), దివ్యేందు (divyenndu) తో కలిసి ఉన్న ఫొటోలను పోస్టు చేశారు. ఇప్పుడు ఈ పోస్టు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ఇది విడుదల కానుంది.