Ramcharan Fans Note: దిల్ రాజు.. ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక
ABN , Publish Date - Jul 01 , 2025 | 07:17 PM
రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ పరాజయంపై దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన వ్యాఖ్యలపై గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ ఫాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు దిల్ రాజు నిర్మాణ సంస్థకు ఖబడ్దార్ అంటూ ఫ్యాన్ సవాల్ విసిరారు.
రామ్‌చరణ్ (Ram charan) నటించిన 'గేమ్ ఛేంజర్' 9Game changer) పరాజయంపై దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన వ్యాఖ్యలపై గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ ఫాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు దిల్ రాజు నిర్మాణ (Dil raju) సంస్థకు 'ఖబడ్దార్' అంటూ ఫ్యాన్ సవాల్ విసిరారు. 'తమ్ముడు'(Thammudu) సినిమాలో భాగంగా నిర్మాత శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ అయింది.. హీరో వచ్చి మాకేమన్నా హెల్ప్ చేశాడా? దర్శకుడు వచ్చి సాయం అందించాడా? కర్టెసీ కోసం కానీసం కాల్ చేసి, ఎలా ఉన్నారని కూడా ఇద్దరూ అడగలేదు’’ అంటూ శిరీష్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రామ్‌చరణ్ అభిమానులు మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు. (Ram charan Fires)
దిల్ రాజుగారు..
సినిమా అనేది ఒక వ్యాపారం. దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయనేది అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్‌లో చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు, ఒక సినిమా నష్ట పోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంత వరకూ న్యాయం’ అంటూ ప్రశ్నించారు. ఇలా పలు ప్రశ్నలు సంధించారు.
1) ‘1 నేనొక్కిడినే’ సమయంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా?
2) మైత్రీ మూవీ మేకర్స్‌కు ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా?
3) సైంధవ్ సినిమా ఫెయిల్ అయితే, ఆ నిర్మాత వెంకటేశ్ గారి గురించి ఎక్కడా ఒక్క మాట చెడ్డగా మాట్లాడలేదు!
4) సంక్రాంతి వస్తున్నాం సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో వెంకటేశ్ గారికి ఎంత ఇచ్చారు. ముందు మీరు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఇచ్చారా? ఎక్కువ ఏమైనా ఇచ్చారా?
5) ‘దర్శకుడు శంకర్ ఉన్నాడు’ అని వెళ్లింది ఎవరు? ఒక సంవత్సరం అంటూ 3 ఏళ్లు హీరో సమయం వృధా చేసింది ఎవరు?
6) ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరోపై విషం చిమ్మడం కరెక్టేనా?
7) మా అభిమానులు 3 ఏళ్లుగా సినిమా కోసం ఎదురుచూసి, విడుదలైన సినిమా ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతి రోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు.
8) ప్రతి ప్రెస్‌మీట్, ప్రతి ఇంటర్వూలో పదేపదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు.
ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి కానీ, రామ్‌చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఖబడ్దార్’’ అని లేఖలో పేర్కొన్నారు.