Hit3: నా ప్రియమైన సోదరుడు నానికి.. రామ్‌చరణ్ ప్రశంసలు
ABN, Publish Date - May 04 , 2025 | 01:40 PM
నాని హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హౌస్‌పుల్ కలెక్షన్లతో వసూళ్లు రాబడుతున్న చిత్రం హిట్3. తాజాగా గ్లొబల్ స్టార్ రామ్‌చరణ్ హిట్3 విజయంపై నానిని ప్రశంసలతో ముంచెత్తాడు.
నాని (Nani) హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హౌస్‌పుల్ కలెక్షన్లతో వసూళ్లు రాబడుతున్న చిత్రం హిట్3 (HIT3). విడుదలైన అన్ని చొట్ల నుంచి మంచి కలెక్షన్లు రాబడుతూ నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.82 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డులు నెలకొల్పింది.కాగా ప్రస్తుతం నాని అమెరికాలో తిరగుతూ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ తనకు మొదటి నుంచి బిగ్గెస్ట్ సపోర్ట్‌గా ఉన్న ఆడియెన్స్‌ను కలుస్తున్నాడు.
మరోవైపు గ్లొబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) తాజాగా హిట్3 (HIT3) విజయంపై నాని (Nani) ని ప్రశంసలతో ముంచెత్తాడు. వరుసగా డిఫరెంట్ స్క్రిప్టులు సెలక్ట్ చేసుకుంటూ విజయాలు అందుకోవడం బావుందని, ఇప్పుడు హిట్3 సినిమా గురించి ఓ రేంజ్‌లో టాక్ వినిపిస్తోందంటూ కంగ్రాట్యులేషన్స్ తెలిపాడు. మూవీ రచయిత, దర్కవకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu), హీరోయిన్ శ్రీనిధి షెట్టి (Srinidhi Shetty) ఇతర మూవీ యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.