Folk Song: రామన ఉయ్యాలో.. పాట ఎంత బాగా పాడారో చూడండి
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:32 AM
తెలంగాణల రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో మరో ఆసక్తికరమైన జానపద గీతం యూట్యూబ్‌కు వచ్చేసింది.
తెలంగాణల రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో మరో ఆసక్తికరమైన జానపద గీతం యూట్యూబ్‌కు వచ్చేసింది. తరుచూ వచ్చే హంగు ఆర్భాటలు, డ్యాన్సులు, కలర్‌ఫుల్‌గా లోకేషన్స్ తరహాలో కాకుండా ఉత్సవాలు, జాతరల సమయంలో గ్రామాల్లో పెద్దవాళ్లు కోలాటం ఆడుతూ ఆలపించే పాట మాదిరిగా ఈ గీతాన్ని తీర్చిదిద్దారు.
రామన ఉయ్యాలో శ్రీరామ దేవన ఉయ్యాలో (Ramana Uyyalo) అంటూ సాగే ఈ గీతం ప్రతి ఒక్కరికి వెంటనే కనెక్ట్ అయ్యేలా పాడేలా ఉంది. ఈ దాండియా పాట త్వరగానే ప్రజాదరణ పొందే అవకాశం కనిపిస్తోంది. శివ సంగీతంలో రుక్మిణి, లావణ్య ఆలపించగా రాజేశ్ గంధం అదనపు సాహిత్యం అందిచారు. మీరూ ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.