Euphoria: గుణశేఖర్ యుఫోరియా నుంచి.. రామ అంటూ రాగమందుకో లిరికల్ వీడియో
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:19 AM
నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘యుఫోరియా’ చిత్రం నుంచి రామ అంటూ రాగమందుకో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). భూమికా చావ్లా (Bhumika Chawla), సారా అర్జున్ (Sara Arjun), రోహిత్ (Rohith) కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే చిత్ర బృందం ఓ కార్యక్రమం నిర్వహించి ఈ చిత్రం నుంచి ఫ్లై హై అంటూ సాగే గీతాన్ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా రామ రామ అంటూ (Rama Rama Lyrical Video) రాగమందుకో అంటూ సాగే ఓ మెలోడీని విడుదల చేశారు. కాలభైరవ (Kaala Bhairava) స్వరాలు సమకూర్చారు. చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad) సాహిత్యం అందించగా వాస పావని (Vasa Pavani), అదిత్య అయ్యంగార్ (Aditya Iyengar), హర్ష బీవీ (Harsha BV), రిషిల్ (Rishil) కలిసి సంయుక్తంగా ఆలపించారు.