RAPO 22: టైటిల్ రివీల్ ఆ రోజే
ABN, Publish Date - May 08 , 2025 | 07:23 PM
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది.

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram pothineni) కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ సినిమా రూపొందుతోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి (Mahesh Babu) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ (Rapo 22) చిత్రమిది. మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొత్త సినిమా టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.