Andhra King Thaluka: పాట రాసిన రామ్ పోతినేని
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:50 AM
ఇప్పటి వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన యువతరం కథానాయకుడు రామ్ పోతినేని తొలిసారిగా గీత రచనలోనూ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఆయన హీరోగా...
ఇప్పటి వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన యువతరం కథానాయకుడు రామ్ పోతినేని తొలిసారిగా గీత రచనలోనూ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఆయన హీరోగా మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ పోతినేని సినిమా అంటే పిచ్చి ఉన్న కుర్రోడి పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం రామ్ అద్భుతమైన పాటను రాశారు. ఈ పాటకు సంగీత ద్వయం వివేక్ - మెర్విన్ స్వరాలు సమకూర్చగా అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ఇప్పటి వరకూ అనిరుధ్ పాడిన పాటలన్నీ హిట్ అవడంతో ఈ పాటపై అంచనాలు పెరిగాయి. కాగా, ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బొర్సే కథానాయికగా నటిస్తున్నారు.