Ram Pothineni: శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్...
ABN , Publish Date - May 10 , 2025 | 07:40 PM
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా పేరును ఈ నెల 15న రివీల్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు రామ్ తెలిపారు.
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న 22వ చిత్రం షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. తాజాగా రామ్ తన పాత్రకు డబ్బింగ్ సైతం పూర్తి చేసేశాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి. మహేశ్ బాబు (P Mahesh Babu) దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan) ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో హీరోయిన్.
రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా మే 15న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు ఇందులో ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ తమిళ చిత్రాల దర్వకులు వివేక్ - మెర్విన్ (Vivek - Mervin) ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్ కు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు ఈ మూవీ చక్కని విజయాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kadhakali: బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్ లో...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి