Ram pothineni: వస్తున్నాం.. లెగుస్తున్నాం.. మళ్ళీ కొడుతున్నాం

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:47 AM

'నా కెరీర్‌లో గర్వపడే సినిమా  ఇది. అవుట్‌ బాగా రావడం వెనక ఎంతోమంది కష్టం ఉంది. సంగీత దర్శకుడు వివేక్‌ మార్విన్‌ తెలుగు సినిమాకి కొత్త కొత్త సౌండ్‌ తీసుకొచ్చారు. ఈ ఆల్బమ్‌ గుండెల్లో నిలిచిపోతుంది.


రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. మహేశ్‌బాబు పి దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స?్టర్‌ ఉపేంద్ర ఆన్‌–స్ర్కీన్‌ సూపర్‌స్టార్‌ పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి  వివేక్‌, మెర్విన్‌ సంగీతం అందించారు. నవంబర్‌ 27న థియేటర్లలో విడుదల కానుంది, ఈ సందర్భంగా వైజాగ్‌లో  మ్యూజిక్‌ కాన్సర్ట్‌ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హోం మినిస్టర్‌ వంగలపూడి అనిత మాట్లాడుతూ 'వైజాగ్‌ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ సినిమాని ప్రమోట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రా కింగ్‌ తాలూక’ టైటిల్‌ వినగానే చాలా కనెక్ట్‌ అయ్యాను. ఎలక్షన్‌ టైమ్‌లో మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూక అనేవి చాలా ప్రజాదరణ పొందిన టైటిల్స్‌. ఉపేంద్ర గారు అద్భుతమైన నటనతో తెలుగులో కూడా ఎంతో గొప్ప అభిమానం సంపాదించుకున్నారు. రామ్‌ ఎనర్జీ అంటే ఇష్టం. తన సినిమాలు చూసేప్పుడు బాడీలో స్ర్పింగ్‌ పెట్టుకున్నాడా అనిపించేది. దర్శకుడు మహేష్‌ వైజాగ్‌ వాసి అవ్వడం గర్వపడుతున్నాం’ అన్నారు.

నా కెరీర్‌లో గర్వపడే సినిమా: రామ్‌ పోతినేని

'నా కెరీర్‌లో గర్వపడే సినిమా  ఇది. అవుట్‌ బాగా రావడం వెనక ఎంతోమంది కష్టం ఉంది. సంగీత దర్శకుడు వివేక్‌ మార్విన్‌ తెలుగు సినిమాకి కొత్త కొత్త సౌండ్‌ తీసుకొచ్చారు. ఈ ఆల్బమ్‌ గుండెల్లో నిలిచిపోతుంది. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌తోపాటు మంచి నటన ఉన్న ఆర్టిస్ట్‌. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్న తరుణంలో మహేష్‌ నా జీవితంలోకి వచ్చాడు. తనతో వర్క్‌ చేయడం మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఎక్స్పీరియన్స్‌. అతనులాంటి నిజాయతీగల ఫిలిం మేకర్స్‌ తెలుగు సినిమాకి కావాలి. తను మరి ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. పాతికేళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర గారి సినిమా చూసి తన మనసు మార్చుకుని ధైర్యంగా నిలబడి ఓ కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఒక సినిమాకి,, అభిమానానికి ఉన్న శక్తి. ఉపేంద్ర గారితో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్పా. జీవితంలో పైకి రావాలంటే పాషన్‌, పర్పస్‌ ఉండాలి.  నా పర్పస్‌ మీరే. రెండు ఇక్కడ టన్నులు టన్నులు ఉంది. వస్తున్నాం.. లెగుస్తున్నాం.. మళ్ళీ కొడుతున్నాం’ అని అన్నారు.

హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ 'నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీరు చూపించే అభిమానానికి ధన్యవాదాలు. రామ్‌ తన అభిమానుల్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలిసింది. ఆయన కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌. మీ అందరి ప్రేమకు ఆయన అర్హులు’ అని అన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:47 AM