Aandhra King Taluka: నా కథకు.. ఆయనే హీరో! అదిరిపోయిన ఆంధ్రా కింగ్ తాలుఖా ట్రైలర్
ABN , Publish Date - Nov 18 , 2025 | 09:33 PM
రామ్ కథానాయకుడిగా నటించిన ఆంధ్రా కింగ్ తాలుఖా ట్రైలర్ మంగళవారం రాత్రి విడుదల చేశారు.
రామ్ (Ram Pothineni), భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse)జంటగా, రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) కీలక పాత్రలో నటించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలుఖా (Andhra King Taluka). మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సెన్సిబుల్ చిత్రం తర్వాత మహేశ్ బాబు (Mahesh Babu P)దర్శకత్వం వహిస్తున్నాడు.
టైటిల్ ప్రకటన నుంచే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఆపై వచ్చిన టీజర్, పాటలు అంచనాలను మరింతగా పెంచేశాయి. మరో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మంగళవారం ఈ మూవీ ఆఫీసియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తుంటే మ్యాటర్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. సూర్య అనే సినిమా హీరోకు వీరాభిమాని అయిన సాగర్ అనే మధ్య తరగతి యువకుడి కథగా ఈ సినిమా తెరకెక్కినట్లు ఇట్టే అర్థమవుతుంది. ఉన్న ఊరిలో ఎన్నో అవమానాలు భరించిన సాగర్ తానేంటే, తన హీరో ఏంటో నిరూపించాలని డిసైడ్ అవడం.. అదే సమయంలో తన అభిమానిని కలవడం కోసం హీరో చేసే ప్రయత్నం నేపథ్యంలో సినిమా ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ జర్నీగా ఉండనున్నట్లు అర్థమవుతుంది. మీరూ ట్రైలర్ పై లుక్కేయండి.