scorecardresearch

Aaradhya Devi: వైల్డ్ యానిమల్స్‌తో శారీ బ్యూటీ అరాచకం 

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:17 PM

ఒక హీరోయిన్ ఎన్ని కోణాల్లోనైనా అందంగా చూపించడం అర్జీవికే సాధ్యమేమో. ఇటీవల ఆయన మనసు పారేసుకున్న ఓ హీరోయిన్‌ని వైల్డ్ యానిమల్స్‌తో కలిపి ఎవ్వరు చేయలేని విప్లవాత్మకమైన సాహసం చేశాడు.

Aaradhya Devi: వైల్డ్ యానిమల్స్‌తో శారీ బ్యూటీ అరాచకం 
Aaradya Devi Photo Shoot With Wild Animals

ప్రముఖ స్టిల్స్ ఫోటోగ్రాపర్ నవీన్ కళ్యాణ్ భారతీయ సినీ చరిత్ర లో తొలి సారిగా ఓ విప్లవాత్మక ఫోటో సిరీస్ కి శ్రీకారం చుట్టారు. ఆరాధ్య దేవి ప్రదాన పాత్రతో రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో తెరకెక్కిన 'శారీ' చిత్రం త్వరలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే! ఆ చిత్ర హీరోయిన్ ఆరాధ్య దేవి తో నవీన్ కళ్యాణ్ 'యానిమల్ ఆరాధ్య' టైటిల్ తో ఫోటో సిరీస్ రూపొందించి సరికొత్త ప్రయోగం చేసాడు. హైదరాబాద్ లోని ఓ పబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ గోపాల్ వర్మ హాజరై ఫోటో సిరీస్ ని ఆవిష్కరించారు.ఈ ఫోటో సిరీస్ లోని అంత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకూ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో ఫోటోలను తీయడం జరగలేదు. అందువల్ల ఇది సమ్ థింగ్ స్పెషల్ ఫోటో సీరిస్ అని ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందమైన ఆరాధ్యదేవిని ఒక వైల్డ్ యానిమల్ తో కంపేర్ చేస్తూ సరికొత్త క్రియేటివిటీ తో, ఆమెలోని అందాన్ని అడివి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫోటో సీరిస్ గా రూపొందించారు.


WhatsApp Image 2025-02-09 at 17.19.29.jpegఈ వైల్డ్ ఫోటోలలో ఆరాధ్యని అడివి జంతువులైన మాకావు , ఇగువానా , కొండచిలువ, నల్ల హంస, ఆస్ట్రీచ్, రేస్ గుర్రంతో కలిసి కళ్యాణ్  ఈ అధ్బుతమైన చిత్రాలను తన కెమెరాలో బందిచారు. ఈ ఫోటో షూట్ కు ప్రణతి వర్మ కాస్టుమ్ డిజైనర్ గా వ్యవహరించారు. చూపు మరల్చనీయకుండా చేసే ఈ ఫోటో సీరిస్ స్వేచ్ఛకు, నిర్భయానికీ ప్రతీకగా ఉన్నాయి.


WhatsApp Image 2025-02-09 at 17.02.57.jpegఆవిష్కరణ తరువాత దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ .. "అడవి మృగలంటేనే అందరు భయపడతారు.. ఎందుకంటే అవి మనల్ని ఏం చేస్తాయన్నది మనం ఊహించలేము. అలాంటిది మా హీరోయిన్ ఆరాధ్య ఎంతో ధైర్యంగా వాటిని కలుపుగోలుగా మచ్చిక చేసుకుని ఈ ఫోటో సిరీస్ చేసింది. ఇలా అడివి జంతువులతో ఒక అమ్మాయి ఫోటో షూట్ చేయడం సమ్ థింగ్ స్పెషల్ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో చిత్రీకరించిన ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ ను అభినందిస్తున్నాను. ఇక ఆరాధ్య దేవి గురించి చెప్పాలంటే కేరళకు చెందిన అమ్మాయి - ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది.  ఆరాధ్యను ఓ ఇన్ స్టా రీల్ లో తొలుత శారీలో చూశాను. ఆ తరువాత ఈ అమ్మాయి సైకలాజికల్ థ్రిల్లర్ కథ 'శారీ' చిత్రం లో కథానాయకి గా సరిపోతుందని సినిమా పూర్తి చేశాం. ఈ నెల 28న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ శారీ లో వున్నాఅమ్మాయి ఈ విధంగా చుడోచ్చనేది నవీన్ కళ్యాణ్ మదిలో మెదిలిన ఆలోచన. ఈ క్రెడిట్ అంతా అతనిదే!" అన్నారు.


WhatsApp Image 2025-02-09 at 17.02.56.jpegస్టిల్స్ ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ మాట్లాడుతూ - "నేను ఆర్జీవీ సర్ వద్ద పదేళ్లుగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నుండి కూడా నన్ను సర్ బాగా సప్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఓ రోజు నన్ను ఆఫీస్ కి పిలిపించి శారీ చిత్రంలోని ఓ పాటను చూపించారు. పాటలు చాల బాగున్నాయి. ఆరాధ్య ఆ పాటల్లో చాలా అందంగా హుందాగా కనిపించింది. అయితే ఆరధ్యను ప్రత్యేకంగా ఓ ఫోటో షూట్ చేద్దామని అడిగాను. దానికి ఆర్జీవి సర్ ఎప్పుడూ రెగ్యులర్ గా వుండే ఫోటోలు కాదు ఏదైనా డిఫరెంట్ చెయ్యి అన్నారు. అప్పడు వైల్డ్ యనిమల్స్ తో ఓ ఫోటో షూట్ చేద్దామని అనుకుంటున్నానని చెప్పా! మరి నీ ఓకేనా అంటే అవి వైల్డ్ యనిమల్స్ కదా మైంటైన్ చేయగలవా అన్నారు. సరే అనుకోని వాటితో షూటింగ్ చేశాము. నాకైతే కెమెరా తో పని కాని ఆ పాము, ఇగువాన వంటి ఒళ్ళు జలదరించే వాటితో ఆరాధ్య ఎంతో ఫ్రెండ్లీ గా ఫోటో షూట్ కి సహకరించింది." అన్నారు.


WhatsApp Image 2025-02-09 at 17.02.57 (1).jpegWhatsApp Image 2025-02-09 at 17.02.56 (1).jpegఆరాధ్య దేవి మాట్లాడుతూ - "ఈ ఫోటో షూట్ గురించి ఆర్జీవి సర్ చెప్పినపుడు నేను కాస్త ఆలోచించాను! కొత్తదనం కోసం పరితపించే ఆర్జీవి సర్ ఊరికే చెప్పారు. ఏ మాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాను. ఆర్జీవి సర్, నవీన్ కళ్యాణ్ గారి ఎంకరేజ్మెంట్ తో ఈ ఫోటో షూట్ పూర్తి చేశాను. వైల్డ్ యనిమల్స్ అంటే అందరికి భయమే షూట్ జరుగుతున్నపుడు నాకు కూడా అస్త్రిచ్ తో ఓ సారి భయమేసింది."అన్నారు.


WhatsApp Image 2025-02-09 at 17.19.30 (1).jpegWhatsApp Image 2025-02-09 at 17.19.30.jpegకాస్టుమ్ డిజైనర్ ప్రణతి వర్మ - "నవీన్ కళ్యాణ్, ఆర్జీవి సర్ ఈ కాన్సెప్ట్ చెప్పినపుడు వైల్డ్ యనిమల్స్ తో ఫోటో షూట్ అనగానే ఇదేదో కొత్తగా వుంది అనుకున్నాను ఓ చాలెంజ్ గా తెసుకున్నాను. యం టి వి వంటి పాపులర్ మ్యూజిక్ చానల్ లో ఓ సారి ఓ వీడియో ఆల్బం చూశాను.. ఆ రిఫరెన్స్ తీసుకుని ఈ షూట్ కి డిజైన్ చేయడం జరిగింది."అన్నారు.


WhatsApp Image 2025-02-09 at 17.02.54.jpegWhatsApp Image 2025-02-09 at 17.19.30 (1).jpeg

Updated Date - Feb 09 , 2025 | 06:07 PM