Ram Charan: లండన్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహావిష్కరణ
ABN , Publish Date - May 11 , 2025 | 09:07 AM
లండన్‌లోని పేరొందిన మేడమ్ టుస్సాడ్స్ (Madame tussauds) మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) మైనపు విగ్రహం కొలువుదీరింది
లండన్‌లోని పేరొందిన మేడమ్ టుస్సాడ్స్ (Madame tussauds) మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) మైనపు విగ్రహం కొలువుదీరింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌తో పాటు భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి - సురేఖ, కుమార్తె క్లీంకార పాల్గొన్నారు. ఈ చరణ్ మైనపు విగ్రహంలో (Wax statue) ఆయనతో పాటు తన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండటం విశేషం. ఇలా పెంపుడు జంతువుతో కలిసి ఉన్న మైనపు విగ్రహం కలిగిన రెండో సెలబ్రిటీ రామ్ చరణ్ కావడం విశేషం. తొలి స్థానం రాణి ఎలిజబెత్ దక్కించుకుంది.
ఈ వేడుకలో చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి తమ మైనపు విగ్రహంతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. త్వరలో ఈ ప్రతిమను సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్‌కు తరలించనున్నారు. ఆ తర్వాత అది అక్కడే శాశ్వతంగా కొలువుదీరనుంది.