Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తొలి యాక్టింగ్ వీడియో వైరల్!
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:46 PM
చిరుతకు ముందే కెమెరా ముందు రామ్ చరణ్ శ్రియా శరణ్‌తో నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
2007లో ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ఇప్పుడు ప్రపంచస్థాయికి ఎదిగింది. కానీ ఆయన కెమెరా ముందు తొలిసారి యాక్టింగ్ చేసిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రామ్ చరణ్‌తో పాటు శ్రియా శరణ్ కూడా కనిపిస్తోంది. ఈ అరుదైన వీడియోను తాజాగా ఓ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇందులో రామ్ చరణ్, శ్రియా హిందీలో ఓ రొమాంటిక్ సీన్‌లో నటించారు. శ్రియా కంఫర్ట్‌గా కనిపించినప్పటికీ, చరణ్ మాత్రం తన డైలాగ్‌లు చెబుతూ, ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ కొంత సిగ్గుపడుతున్నట్టుగా, అసౌకర్యంగా ఉన్నట్టుగా కనిపించాడు.
ఆ ఇనిస్టట్యూట్ ఫౌండర్ కిషోర్ నమిత్ కపూర్ ఈ వీడియో వెనుక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “ఇది రామ్ చరణ్ కెమెరా ముందు చేసిన తొలి సీన్. ఆయన చాలా టెన్షన్‌గా, ఇబ్బందికరంగా ఫీలయ్యాడు. శ్రియా అప్పటికే దక్షిణాదిలో స్టార్. కానీ ఆమె కూడా అప్పట్లో ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది” అని చెప్పారు.కిషోర్ నమిత్ ఇంకా మాట్లాడుతూ.. నేను దర్శకుడిగా చెప్పాలంటే శ్రీయ నటనలో తప్పులు చెబుతాను. కానీ కోచ్‌గా చూస్తే ఆమె చాలా బెటర్‌గా మారిందని చెబుతాను. శిక్షణ తర్వాత శ్రియా మరింత పర్ఫెక్ట్ యాక్ట్రెస్ అయింది అని వ్యాఖ్యానించారు.
అయితే.. శ్రియా శరణ్ 2001లో ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సంతోషం సినిమా తర్వాత టాప్‌లో దూసుకెళ్లింది. ఆపై బాలీవుడ్‌లో సైటిల్ అయింది. ఇక రామ్ చరణ్ 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు గ్లొబల్ స్టార్‌గా అవతరించాడు. ఇదిలాఉంటే రామ్ చరణ్, శ్రియా ఇప్పటివరకు కలిసి ఏ సినిమాలో నటించకపోయినా, ‘ఆర్ఆర్ఆర్’లో మాత్రం చరణ్ తల్లిగా శ్రియ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఇది నిజంగా చరణేనా?, “ఇంత అమాయకంగా కనిపించాడు అంటే నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.