Ram Charan: ఏపీ ఏరువాక‌లో.. పెద్ది సీన్ రీ క్రియేషన్ (వీడియో వైర‌ల్‌)

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:34 AM

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది చిత్రం షూటింగ్ ద‌శ నుంచే రోజుకో విష‌యంలో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది.

ram

రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan), బుచ్చిబాబు సాన కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్నపెద్ది చిత్రం షూటింగ్ ద‌శ నుంచే రోజుకో విష‌యంలో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. సినిమా స్టార్ట్ ఆయింది మొద‌లు ఆ మ‌ధ్య పెద్ది ఫ‌స్ట్ షాట్ రిలీజ్ అయ్యేంత‌వ‌ర‌కు ఓ మోస్త‌రు హైప్‌తో ఉన్న ఈ చిత్రం గ్లిమ్స్ రిలీజ్ అనంత‌రం సినిమాపై అంచ‌నాలు అమాంతం ఆకాశానికి అంటాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. అంత‌గా ఈ మూవీ సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండింగ్ అయింది, ఇంకా అవుతోంది. ముఖ్యంగా సినిమాలో చ‌ర‌ణ్‌ క్రికెట్ ఆడే స‌న్నివేశం, కొట్టే షాట్ యూనిక్‌గా ఉండి ప్ర‌తి ఒక్క‌రూ దానిని ఫాలో అయ్యే విధంగా వైర‌ల్ అయింది.

ఐపీఎల్ సంద‌ర్భంగా స్టార్ క్రికెట‌ర్లు కూడా ఈ షాట్‌ రీక్రియేష‌న్ చేయ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా దుమ్ము లేపింది. అయితే ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎరువాక పౌర్ణ‌మి సంద‌ర్భంగా క‌ర్నూలు గుడిక‌ల్ (Gudikal Village) గ్రామ యువ‌కులు పెద్ది సినిమా నుంచి రామ్‌చ‌ర‌ణ్ క్రికెట్ షాట్‌ను రీక్రియేట్ చేసి రామ్‌చ‌ర‌ణ్‌పై త‌మ‌కున్న‌ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది. అయితే గ‌తంలోనూ ఈ గ్రామ యువ‌కులు ఎన్టీఆర్ దేవ‌ర గెట‌ప్‌, పుష్ఫ‌లో అల్లు అర్జున్ గెట‌ప్‌, గేమ్ ఛేంజ‌ర్ చ‌ర‌ణ్ లుక్స్ రీ క్రియేట్ చేయ‌డం విశేషం.

Updated Date - Jun 13 , 2025 | 01:09 PM