Ram Charan: కవలలకు.. జన్మనివ్వబోతున్న ఉపాసన? మెగా ఫ్యామిలీలో.. మిన్నంటిన సంబురాలు!

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:13 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మరోసారి తండ్రి కాబోతున్నారు. దీపావళి సీజన్ లోనే ఉపాసన సీమంతం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.

Ram Charan - Upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ramcharan) మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana) ఓ వీడియో ద్వారా తెలియచేశారు. ఈ యేడాది దీపావళి సీజన్ లో మెగా ఫ్యామిలీలో రెండు వేడుకలను జరిగాయని అనుకోవచ్చు. దీపావళి రోజున మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా రంగంలోని సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే ఆయన కోడలు ఉపాసన తాజాగా గురువారం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఇటు చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు అటు ఉపాసన కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. ఉపాసన పోస్ట్ చేసిన వీడియో చూస్తుంటే ఆమెకు వీరందరి సమక్షంలో సీమంతం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన వరుణ్‌ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి సైతం ఈ వీడియోలో ఉత్సాహంగా ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు. అలానే పవన్ కళ్యాణ్‌ భార్య ఈ వేడుకలో పాల్గొన్నారు. విశేషం ఏమంటే... చిరంజీవి ఇంట్లో దీపావళికి జరిగిన పార్టీలోనే ఈ వేడుకనూ కలిపి చేశారు. కానీ అక్కడకు హాజరైన ఎవరూ కూడా ఉపాసన సీమంతంకు వెళ్ళినట్టుగా చెప్పనే లేదు.


మెగాభిమానులు మాత్రం ఈ వీడియోను చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. 2012లో రామ్ చరణ్‌, ఉసాసన వివాహం కాగా వారికి 2023లో క్లింకారా (Klin Kaara) జన్మించింది. ఇప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా క్లింకార కు మరో తోడును చెర్రీ దంపతులు ఇవ్వబోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

కవలలకు జన్మనివ్వబోతున్న ఉపాసన

ఉపాసన కొణిదెల ఈసారి జన్మనివ్వబోతోంది కవలలకు అని తెలుస్తోంది. కుటుంబ సన్నిహితుల సమాచారం ప్రకారం ఉపాసనకు ట్విన్స్ పుట్టబోతున్నారట. సహజంగా ట్విన్స్ అనగానే ఇద్దరు అబ్బాయిలో, ఇద్దరు అమ్మాయిలో పుడుతుంటారు. అయితే అందుకు భిన్నంగా ట్విన్స్ లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా పుట్టిన దాఖలాలు కొన్ని ఉన్నాయి.

చిరంజీవి ఇప్పటికే తన ఇంటిలో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారని, వారసుడిగా అబ్బాయి పుడితే బాగుంటుందని ఆ మధ్య అన్నారు. మరి ఇప్పుడు ఉపాసన జన్మనివ్వబోతున్న ట్విన్స్ లో ఎవరెవరు ఉంటారో తెలియాలంటే డెలివరీ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే! ఇదిలాఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌లో మంచు విష్ణుకు మాత్ర‌మే క‌వ‌లలు జ‌న్మించ‌గా ఇప్పుడు ఆ లిస్టులో రామ్‌చ‌ర‌ణ్ చేర‌బోతున్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 07:40 PM