Game Changer: ట్రెండింగ్‌లో.. గేమ్ ఛేంజర్! గట్టిగా వేసుకుంటున్నారుగా
ABN , Publish Date - May 25 , 2025 | 03:40 PM
ఈయేడు జనవరిలో థియేటర్లలోకి వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం గేమ్ ఛేంజర్ నెట్టింట మరోసారి తెగ ట్రెండ్ అవుతోంది..
ఈయేడు జనవరిలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer). దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) ఈ సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసిన ఆయనకు ఈ చిత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. అయితే తొలిరోజునే నెగిటవ్ గాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు పోటీగా సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రం ఉండడంతో గేమ్ ఛేంజర్ మధ్యలోనే చేతులెత్తేయాల్సి వచ్చింది.
అయితే.. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా స్క్రీన్ ప్లే, రన్ టైం, రిలీజ్ రోజే ఫైరసీ తదితర సమస్యల వళ్ల మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని తేల్చినా ఎవరూ బాధ్యత వహించలేదు. శంకర్ లాంటి డైరెక్టర్ అనుకోకుండా సినిమాను చాలా కట్ చేయాల్సి వచ్చిందని బాధ పడడం, ఆపై పాటల చిత్రీకరణపై తమన్ కామెంట్లు చేశారే తప్ప ఇప్పటికీ ఆ సినిమాలో ఎక్కడ మిస్టేక్ జరిగిందో తేల్చలేక పోయారు. దీంతో మూవీ వచ్చి పోయిన నాలుగు నెలల తర్వాత కూడా ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎక్కడో ఓ చోట చర్చ నడుస్తూనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా.. అసలు గేమ్ ఛేంజర్ రన్ టైం ఏడున్నర గంటలు వచ్చిందంటూ ఇటీవల ఎడిటర్ షమీర్ మొహ్మద్ ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు ఈ కామెంట్లు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 7.30 గంంటలకు పైగా ఉన్న చిత్రాన్ని 3 గంటలకు తీసుకు వచ్చానని, ఆపై నాకు శంకర్ గారితో పడక వెళ్లి పోయానని మరో ఎడిటర్ వచ్చి సినిమాలో మరి కొంత కట్ చేశాడని అసలు విషయం తెలిపాడు. పైగా శంకర్ సర్‌తో పని చేయడం చాలా కష్టమంటూ బాంబు పేల్చాడు.
కాగా.. గతంలో శంకర్ 5గంటల రన్ టైం ఉంటే చాలా కట్ చేశామని చెప్పగా ఆ సమయంలో చాలా మంది షాక్ అయ్యారు. తీరా ఇప్పుడు 5 గంటలు కాదు 7 గంటలకు పైగానే మూవీ ఉందని తెలిసి తెలుగు ప్రేక్షకులు ముక్కుపై వేలు వేసుకుంటున్నారు. అంత పెద్ద సినిమా తీసి, అన్ని వందల కోట్టు ఖర్చు పెట్టి జనాలను మెప్పించే మూవీ తీయలేక పోయారు అంటూ చాలామంది సెటైర్లు వేస్తున్నారు. అంతమంది స్టార్ నటులను పెట్టి ఎవరినీ సరిగ్గా ప్రొజెక్టు చేయలేక పోయారు, అన్ని సగం సగం సన్నివేశాలే ఉన్నాయంటు కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు శంకర్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఇష్యూతో ఇప్పడు మరోసారి గేమ్ ఛేంజర్ మూవీ ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతుంది.