Peddi-Ramcharan: 'పెద్ది'లో సమంత.. అందుకోసమేనా..
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:18 PM
తాజాగా 'పెద్ది' సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో ఈ సినిమా టైటిల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) హీరోగా బుచ్చిబాబు (buchi babu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). వృద్ది సినిమాస్ నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి సంబంధించిన అప్‌డేట్ కోసం చెర్రీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో ఈ సినిమా టైటిల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ సాంగ్ ప్లాన్ చేశారని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రత్యేక గీతంలో సమంత (Samantha) కనిపించనుందని టాక్ నడుస్తోంది. గతంలో వీరిద్దరూ ‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మీ పాత్రల్లో మెరిశారు.
ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై సందడి చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సమంత పుష్పలో చేసిన సాంగ్ ఎంతగా ప్రేక్షకుల్ని అలరించిందో తెలిసిందే! అదే తరహాలో ఆ పాట కూడా ఉంటుంది టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం పెద్ది షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చరణ్‌తోపాటు ఇతర తారాగణంపై ఓ వేడుక నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.
కాస్ట్యూమ్ డిజైనర్ హ్యాపీ..
తంగలాన్ సినిమాలో తన పనితనం చూసి పెద్ది చిత్రంలో రామ్‌చరణ్ అవకాశం ఇచ్చారని కాస్ట్యూమ్ డిజైనర్ ఎకమ్ అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. .