Peddi: ‘పెద్ది’ నుంచి.. త్వరలో మరిన్ని సర్‌ప్రైజులు

ABN , Publish Date - Sep 29 , 2025 | 06:43 AM

రామ్‌చరణ్‌ సినీ కెరీర్‌ 18 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, పెద్ది మూవీ మేకర్స్‌ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

Ram Charan

రామ్‌చరణ్ (Ram Charan) టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోగా 18 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. 2007లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు చరణ్‌. ‘మగఽధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలతో బాక్సాఫీసు దగ్గర సత్తా చాటారు.

ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi)సినిమాలో నటిస్తున్నారు. ఇందులో చరణ్‌ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

Ram Charan

‘‘మా ‘పెద్ది’ 18 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరం. తెరపై ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూనే, బయట వినయ విధేయతలు కలిగి ఉండడం చరణ్‌ ప్రత్యేకత. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నాడు. ‘పెద్ది’ నుంచి త్వరలోనే మరిన్ని సర్‌ప్రైజులు ఉండబోతున్నాయి’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Sep 29 , 2025 | 06:43 AM