Rakul preet singh: తెలుగు సినిమాను చాలా మిస్‌ అవుతున్నా

ABN , Publish Date - Dec 20 , 2025 | 08:34 AM

తెలుగు సినిమాను, ప్రేక్షకులను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానన్నారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

తెలుగు సినిమాను, ప్రేక్షకులను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని, చక్కటి స్క్రిప్ట్ కుదిరితే  మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తానని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు(RAKUL PREET SINGH) . తన మేకప్‌ ఆర్టిస్ట్‌ కడలి చక్రవర్తి (చక్రి) ఏర్పాటు చేసిన మేకప్‌ స్టూడియో, అకాడమీ ప్రారంభోత్సవానికి నగరానికి విచ్చేశారామె. పంజాగుట్టలో జరిగిన ఈ కార్యక్రమంలో రకుల్‌ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో కనిపించక పోవడం వల్ల ప్రేక్షకులకు దూరమయ్యానన్నారు.

Rakul.jpeg

ఇక్కడి వారు తనపై చూపిన ప్రేమాభిమానాలను ఎన్నడూ మరిచిపోనన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడ ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. తన మొదటి చిత్రం నుంచి చక్రీతో తనకు చక్కటి అనుబంధం ఉందని తెలిపారు. తనకు తెలుగు నేర్పిన వ్యక్తి ఆయనే అన్నారు. కాగా, తన ఎదుగుదలలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మద్దతు మరువలేనిదని చక్రి తెలిపారు.

Updated Date - Dec 20 , 2025 | 09:56 AM